Parineeti chopra has plan b

Parineeti Chopra has plan B, Parineeti chopra debut movie Ladies vs Ricky Behl, Parineeti Chopra TV show

Parineeti Chopra has plan B

పరిణీతి ప్లాన్ – బి

Posted: 06/29/2014 05:47 PM IST
Parineeti chopra has plan b

పుష్టిగా అందంగా ఉండే పరిణీతి చోప్రా 'లేడీస్ వెర్సస్ రికీ బెహల్' లో సెకండ్ హీరోయిన్ గా చేసి తన నటనతో మంచి పేరు తెచ్చుకుని తర్వాత 'ఇష్క్ జాదే' లో ఆ పేరుని ఇంకా పెంచుకుంది.  

అయితే విమర్శకుల మాటలతో బరువుని తగ్గించుకుని ఇప్పుడు ఒంపుసొంపులతో ఆడ మగ అనే తేడా లేకుండా తలలు గిరుక్కున తిప్పి చూసేట్టుగా, ఆ చూపును కాసేపు ఆమె పైనే నిలిపేట్టుగా తయారైంది.  ఒక టివి షోలో న్యాయనిర్ణేతగా వస్తున్న పరిణీతి చోప్రా తన మూడు సంవత్సరాల సినీ జీవితంలో తన అనుభవాలను చెప్తూ కొన్ని సూత్రాలను కూడా చెప్తున్న సందర్భంలో అందులో ఒకరు, మరి మీకు హీరోయిన్ గా అవకాశాలు రాకపోతే ఏం చేస్తారు అని అడిగారు.  

నిజమే కదా హీరోయిన్ గా ఎలా ఉండాలో తెలుసుకోగానే సరిపోయిందా.  అవకాశాలు కూడా రావొద్దూ.  మరెవరైనా అయితే ఈ ప్రశ్నకు ఇబ్బందిపడేవారేమో కానీ పరిణీతి మాత్రం వెంటనే జవాబు చెప్పింది తనకి ప్లాన్ – బి కూడా ఉందని.  ఇన్వెస్టేమెంట్ లో డిగ్రీ చేసిన తను బ్యాంక్ లో ఉద్యోగానికి ప్రయత్నం చేసి నెల జీతం మీద బతికేస్తానని చెప్పింది.

అలాగే జరిగితే సినీ ప్రేక్షకుల పట్ల అది ఎంత దురదృష్టమో కదా అనిపించేట్టుగా ఉంది పరిణీతి అందం, మాట తీరు కూడా.  నేను ఎలాగైనా బతికెయ్యగలను, మరి తెర మీద నా లావణ్యాన్ని చూసే అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటే నేనేం చెయ్యగలను అన్నట్లుంది ఆమె జవాబు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles