Kamal hassan emotional feelings on manam movie

kamal hassan watching Manam, Kamal Hassan emotional feelings, nagarjuna, akkineni nageswara rao, naga chaitanya, manam, samantha, shriya

Akkineni family film Manam has opened to packed houses and has been running successfully with the highest openings for Akkineni family.

‘మనం ’ చూసి కన్నీరు కార్చేసిన కమల్

Posted: 05/28/2014 07:17 PM IST
Kamal hassan emotional feelings on manam movie

అక్కినేని ఫ్యామిలీ త్రయం కలిసి నటించిన ‘మనం ’ సినిమా గత వారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి, మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, స్వదేశంలో కాసుల వర్షం, విదేశాల్లో డాలర్ల వర్షం కురిస్తున్న విషయం తెలిసిందే.  చాలా కాలం తరువాత టాలీవుడ్ తెర పై వచ్చిన ఈ ఫీల్ గుడ్ మూవీకి సినీ ప్రముఖుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానులు మెంగా ఉన్నాయి.

ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖులు ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీని, ఇంతటి మంచి సినిమా తీసిన దర్శకుడ్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రత్యేకంగా షో వేయించుకొని చూసి దాని పై ఇలా స్పందించారు. నేను చిన్నప్పటి నుంచీ ‘‘శివాజీ గణేషన్ గారికీ, ఏఎన్నార్ గారికీ అభిమానిని.  ‘మనం ’ సినిమా చూశాక ఏఎన్నార్ గారికి ఇంకా ఎక్కువ అభిమానిగా మారిపోయాను.

ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. ఈ సినిమాలో అందరూ నవ్వుతున్నప్పుడు ఏఎన్నార్ గారితో నాకున్న అనుబంధం గుర్తొచ్చి ఏడుపొచ్చింది. ఈ చిత్రాన్ని ఏఎన్నార్ గారి చివరి మాటలా అందంగా తీర్చిదిద్దారు. ఇంతటి మంచి చిత్రాన్ని అందించిన అక్కినేని ఫ్యామిలీకి, అందులో నటించిన వారి కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles