Catherine tresa replaced amala paul role

Catherine Tresa Replaced Amala Paul role, Catherine Tresa got Amala Paul role, Catherine Tresa got chance, amala paul, Catherine Tresa, Catherine Tresa got vasta ni venaka movie offer, telugu movie news, Catherine Tresa latest movie news

Catherine Tresa Replaced Amala Paul role, Catherine Tresa got Amala Paul role, Catherine Tresa got chance, amala paul, Catherine Tresa, Catherine Tresa got vasta ni venaka movie offer, telugu movie news, Catherine Tresa latest movie news

పెళ్లి వల్ల అమలాకు చిక్కు... కెథరిన్ కు లక్కు

Posted: 05/21/2014 09:58 AM IST
Catherine tresa replaced amala paul role

‘‘ఇద్దరమ్మాయిలతో’’ సినిమాలో బన్నికి జోడిగా అమలాపాల్, కెథరిన్ థెరేసాలు నటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ లవర్ చనిపోయిందని తెలిసి కూడా కెథరిన్, బన్నిని ప్రేమిస్తుంది. అంటే అమలాపాల్ స్థానాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. చివర్లో ఏదో ఒకరోజు నీ స్థానంలోకి వస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది. ఇదంతా కేవలం సినిమాలో మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు వీరి నిజ జీవితంలో దాదాపు ఇలాంటి కథే ఒకటి నడుస్తుంది.

త్వరలోనే అమలాపాల్ తమిళ దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లి వలన అమలాకు కోటి రూపాయల నష్టం వచ్చేలా చేసింది. పెళ్లి చేసుకోబోతుందనే విషయం తెలియక అమలాను తెలుగులో ‘‘వస్తా నీ వెనుక’’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. దీనికోసం ఈ అమ్మడికి కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారంట. కానీ ప్రస్తుతం అమలా పెళ్లికి సిద్ధమవుతుండటంతో అమలాను తప్పించి, ఆమె స్థానంలో హీరోయిన్ గా కెథరిన్ ను తీసుకున్నారట ఈ చిత్ర యూనిట్. ఈ విషయం గురించి చిత్ర యూనిట్ ‘అమలా తమ సినిమా ఒప్పకునే సమయంలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పలేదు. అందుకే ఆమెను అప్పట్లో తీసుకున్నాం, కానీ ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుండటంతో ఆమె స్థానంలో వేరే హీరోయిన్ ను తీసుకుంటున్నట్లుగా తెలిపారు.

ఏదో సరదాకు ఆ సినిమాలో చెప్తే... ఇలా నిజ జీవితంలో వచ్చి తన కోరిక తీర్చుకుంటుందని ఎవరైనా అనుకుంటారా చెప్పండి? అమలా పెళ్లి వలన కెథరిన్ కు ఈ విధంగా లక్కు వస్తుందని కెథరిన్ కలలో కూడా ఊహించలేదు కావచ్చు. అయిన అమలా పెళ్లి చేసుకుంటే ఈ సినిమాకు ఏం నష్టం వస్తుందో ఏమో.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles