Hero sumanth busy preparing avakai

sumanth, chandra siddardha, eega, Emo Gurram Egara Vachchu

Sumanth who was last seen in Emo Gurram Egara Vachchu shared the picture of him mixing avakai. He even tweeted That time of the year again.

‘ఆవకాయ్ ’ పెడుతున్న అక్కినేని హీరో

Posted: 04/24/2014 09:02 PM IST
Hero sumanth busy preparing avakai

కొన్ని పెద్ద కుటుంబాల్లో కొన్ని సాంప్రదాయాలు ఆనవాయితీగా వస్తాయి. వాటిని వారి కుటుంబంలో ఎవరో ఒకరు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు అక్కినేని హీరో సుమంత్. అక్కినేని నాగేశ్వరరావు భార్య అన్నపూర్ణమ్మ గారు ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ఆవకాయ్ పచ్చడి పెట్టి తన సన్నిహితులకు, ఇక్కడి బంధువులకు, విదేశాల్లో ఉన్నవారికి పంపుతుండేది.

ఆమె కాలం చేసిన తరువాత ఇక అక్కినేని ఫ్యామిలీ నుండి ఆవకాయ్ తినే భాగ్యం కోల్పోయామని ఫీలవుతున్న వారున్నారు. కానీ ఇఫ్పుడు అదే సంప్రదాయాన్ని ఆమె మనవడు అయిన సుమంత్  ఈ సంవత్సరం తాను ఆవకాయ కలుపుతున్నట్లు, ఆ సంప్రదాయన్ని కంటిన్యూ చేస్తున్నట్లు చెప్తూ సుమంత్ ట్విట్టర్ లో ఈ ఫోటో పెట్టారు. అంటే ఇప్పుడు సుమంత్ తన చేతులతో స్వయంగా కలిపిన ఆవకాయను వారి శ్రేయాభిలాషులు,కుటుంబ సభ్యులు తినబోతున్నారన్నమాట.

ఆ కుటుంబ వారసత్వం నిలబెట్టాలన్న సుమంత్ ప్రయత్నం మెచ్చుకోదగినదే కదా. కానీ కొంత మంది మాత్రం ఎలాగు సినిమాలు లేవు కాబట్టి ఖాళీగా ఉండలేక ఊరగాయలు పెట్టడం నేర్చుకుంటున్నాడని సెటైర్లు వేసుకుంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles