Tollywood director teja to direct kamal haasan

Director teja, Kamal haasan, hero kamal hasan, tamil-telugu film, Tamil version

Teja has changed his mind and is now planning to work with none other than Kamal Haasan.

కమల్ హాసన్ తో డైరెక్టర్ తేజ సినిమా

Posted: 04/23/2014 03:09 PM IST
Tollywood director teja to direct kamal haasan

కొత్త కొత్త నటులను వెండితెరకు పరిచయం చేయడమే కాకుండా, తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమాలు తీసి పెద్ద విజయాలను సొంతం చేసుకునే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తేజ గత కొంత కాలం నుండి సరైన హిట్టు లేక పోయినా అడపా దడపా సినిమాలు తీస్తూ తన పాత హిట్ ట్రాక్ రికార్డుతో బండి లాగిస్తు వస్తున్నాడు. అప్పుడెప్పుడో మహేశ్ బాబు లాంటి హీరోతో ఓ సినిమా చేసినా అది అట్టర్ ప్లాప్ అవ్వడంతో మళ్ళీ స్టార్ హీరోల జోలికి వెళ్ళలేదు.

మళ్ళీ ఇంత‌ కాలానికి ఓ స్టార్ హీరోకి క‌థ చెప్పిన‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ వర్గాల సమాచారం.  ఆస్టార్ ఎవ‌రో కాదు….విలక్షణ నటుడు క‌మ‌ల్‌ హాస‌న్‌. ఇటీవ‌ల తేజ క‌మ‌ల్‌ హాస‌న్‌ కి క‌థ వినిపించిన‌ట్టు, దానికి ఆయ‌న ఓకే చెప్పిన‌ట్టు ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

అయితే ఈ విష‌యంలో తేజ ఇప్పటి వ‌ర‌కూ ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. ఇది వ‌ర‌కు ఎన్‌కౌంట‌ర్ శంక‌ర్ కూడా క‌మ‌ల్‌ కి క‌థ చెప్పిన‌ట్టు చెప్పుకొన్నారు. అయితే అదంతా ఉత్తిదే అని ఆ త‌ర‌వాత తేలింది. ఇదీ అంతేనా..?? లేదంటే ఈ పుకారులో మేట‌రుందా?? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles