Renu desai clarifies her stand on pawan

pawan kalyan,renu desai clarifies,facebook,pawankalyan,pawan kalyan renu desai personal life, Renu Desai, Pawan Renu Desai, pawan marriage,Pawan Kalyan wife,Pawan Kalyan

Renu Desai, ex-wife of Pawan Kalyan, has finally broken her silence and commented on the actor for the first time on a public platform.

పవన్ పై రేణు ఇలా ఎందుకు మాట్లాడిందో ?

Posted: 04/14/2014 03:09 PM IST
Renu desai clarifies her stand on pawan

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై ఎన్నో రూమర్లు, ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వాటన్నింటి పై ఇప్పటి వరకు ఆయన స్పందించి మాట్లాడింది లేదు. ముఖ్యంగా ఆయన పెళ్ళి విషయంలో చాలా పుకార్లు వచ్చాయి. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణుదేశాయ్ కి విడాకులు ఇవ్వడంతో, ఆమె గత కొన్ని రోజుల నుండి పుట్టింటిలో పిల్లలతో కలిసి ఉంటుందని, ఆమెను వదిలి విదేశీ వనితతో ఉంటున్నాడని ప్రచారం జరుగుతున్నా... ఈ విషయంలో ఇటు రేణు కానీ, పవన్ కానీ అఫీషయల్ గా ప్రకటించలేదు.

ఎందుకు విడిపోయారో కూడా ఎప్పుడు చెప్పలేదు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ పై రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఆమె మళ్లీ పవన్ కళ్యాణ్ కి దగ్గర కావడానికే ఇలా మాట్లాడిందా ? లేక ఎలాంటి ధ్వేషాలు లేకుండా కేవలం కొన్ని కమీట్ మెంట్ల కోసమే దూరంగా ఉంటున్న రేణు భర్త పై ఉన్న ప్రేమతో మాట్లాడిందో కానీ, ఆమె చేసిన కామెంట్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్ లాంటి మంచి మనిషి ఈ భూమిపై మరొకరు ఉండరని,  ఆయన స్వచ్ఛమైన మానవత్వం కలిగిన మనిషి అని, కరుణ, దయ కలిగిన కల్మషం లేని దయార్ద హృదయుడని పొడిగారు.

వ్యక్తిగత జీవితంలో తమ మధ్య ఏం జరిగిందో తామిద్దరికి మాత్రమే తెలుసునని పేర్కొన్నారు. దీనిపై కామెంట్ చేసేందుకు బయటివాళ్లకు హక్కు లేదన్నారు. తానెంతో గౌరవించి, అభిమానించే వ్యక్తుల్లో పవన్ ఒకరని అన్నారు. సమాజానికి మంచి చేయాలన్న తపనతో నిజాయితీగా పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనకు ఎల్లప్పుడు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మాటలను బట్టి చూస్తుంటే త్వరలోనే కలిసిపోతారని, అప్పడు అందరి నోళ్ళకు తాళం పడుతుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles