Actor venkatesh radha movie stopped

venkatesh, actor venkatesh, Hero Victory Venkatesh, actor venkatesh radha movie Stopped, Venkatesh Nayanatara , Radha movie, director Maruthi.

actor venkatesh radha movie Stopped

వెంకీ రాధ‌.... గోవిందా!

Posted: 03/27/2014 12:52 PM IST
Actor venkatesh radha movie stopped

టాలీవుడ్ నటులు అందరు రాజకీయల వైపు అడుగులు వేస్తుంటే..  మన విక్టరీ వెంకటేశ్  మాత్రం  సినిమాలపై కసరత్తు చేస్తున్నారు.  ఈ సంవత్సరంలో  మూడు సినిమాలు విడుదల చేయాలనే ఉద్దేశంతో  వెంకీ దూసుకుపోతున్నారు. కానీ వెంకీ ప‌రిస్థితేం బాలేదు.

వ‌రుస ఫ్లాపులు చుట్టుముడుతున్నాయి. మ‌రోవైపు ప‌ట్టాలెక్కాల్సిన సినిమాలు సైతం ఆగిపోతున్నాయి. ఓ అగ్రహీరోకి ఇలాంటి ప‌రిస్థితి రావ‌డం.. నిజంగా దుర‌దృష్టమే. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో చేయాల్సిన ఓమైగాడ్ ఇప్పుడు సందిగ్థంలో ప‌డింది. 

ప‌వ‌న్ రాజ‌కీయాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల‌.. అత‌నొచ్చే వ‌ర‌కూ ఆగాలా?  లేదంటే మ‌రో హీరోతో ప్రొసీడ్ అయిపోవాలా? అన్నది తేల్చుకోలేక‌పోతున్నాడు. మ‌రోవైపు రాధ ప‌రిస్థితి కూడా అంతే!  ఈ క‌థ మాదే అని ఇద్దరు యువ‌కులు ఛాంబ‌ర్‌లో కేసు ఫైల్ చేశారు. ఆ గొడ‌వ ఎంత‌కీ తెగ‌డం లేదు. దాంతో మారుతి ఎందుకైనా మంచిద‌ని కొత్త క‌థ వినిపించాడ‌ట‌. అది... వెంకీకి న‌చ్చలేద‌ని స‌మాచార‌మ్‌. 

వెంకీ కూడా రాధ సినిమాకి లైట్‌గా తీసుకొన్నాడ‌ట‌. దాంతో రాధ సినిమా రాదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మారుతి కూడా కొత్త ప్రాజెక్టుల‌పై దృష్టి పెట్టడంతో రాధ ప‌ట్టాలెక్కే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈలోగా దృశ్యం సినిమా లాగించేయాల‌న్న ఉద్దేశంతో ఆ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు వెంకీ. ఈ యేడాది మూడు సినిమాలు విడుద‌ల చేసి అంద‌రికీ షాక్ ఇవ్వాల‌నుకొన్న వెంకీకి ఈ సినిమాలు ఆగిపోవ‌డం నిజంగా షాకింగ్ న్యూసే.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles