Balayya legend movie cleared by ec and censor board

Balayya Legend movie cleared by EC and Censor Board, Balakrishna, Legend Movie, Director Boyapati Srinu, Radhika Apte, Sonal Chauhan, Jagapati Babu

Balayya Legend movie cleared by EC and Censor Board

లెజెండ్ కి లైన్ క్లియర్

Posted: 03/27/2014 10:16 AM IST
Balayya legend movie cleared by ec and censor board

నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా విడుదలకు అడ్డంకి వస్తుందని భయపడినంతసేపు పట్టలేదు అది తొలగిపోవటానికి. 

సమకాలీన రాజకీయాలకి సంబంధించి పంచ్ డైలాగ్స్ ఉండటంతో, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సెన్సార్ బోర్డు లెజెండ్ సినిమాకి యధాతథంగా సర్టిఫికేట్ ఇవ్వటానికి నిరాకరించింది.  ప్రత్యామ్నాయంగా ఎన్నికల కమిషన్ నుంచి అభ్యంతరం లేదన్న సర్టిఫికేట్ తెచ్చుకోమని సలహా కూడా ఇవ్వటం జరిగింది. 

దానితో చేసేది లేక లెజెండ్ సినీ నిర్మాతలు ఎలక్షన్ కమిషన్ ని ఆశ్రియించారు.  రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల నుంచి అభ్యంతరాలు ఎదురౌతాయేమో అని భయపడ్డ సెన్సార్ బోర్డు ఎన్నికల కమిషన్ కి రిఫర్ చెయ్యమని చెప్పినా అక్కడ లెజెండ్ సినిమాకి ఎటువంటి అభ్యంతరాలూ రాలేదు సరికదా ఇంకా ఆ సినిమాను నిర్మించిన తీరు, సమకాలీన రాజకీయాలలో సున్నితమైన అంశాల విషయంలో దర్శకుడు ప్రతిభావంతంగా చేసిన చిత్రీకరణను ఎన్నికల కమిషన్ అభినందించటం జరిగింది. 

ఇసి అభ్యంతరం లేదంటూ సర్టిఫికేట్ ఇవ్వటంతో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి యుఏ సర్టిఫికేట్ ఇచ్చింది.  దానితో రేపు విడుదల కాబోతున్న లెజెండ్ కి మార్గం సుగమం అయింది. 

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన లెజెండ్ చిత్రం మార్చ్ 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.  రాధికా ఆప్తే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, జగపతి బాబు ఇందులో ప్రతినాయకుడి పాత్రను పోషించటం విశేషం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles