Nagarjuna to make his father dream real

Nagarjuna to make his father dream real, Akkineni Nagarjuna, Akkineni Nageswara Rao, Narendra Modi, Model village Punsari Gujarat, Nagarjuna native plance Ramapuram krishna district

Nagarjuna to make his father dream real

నాన్నగారి కలలు నిజం చేస్తాను- నాగార్జున

Posted: 03/25/2014 04:29 PM IST
Nagarjuna to make his father dream real

గుజరాత్ లో ఆదర్శ గ్రామం పన్సారీని చూసిన తర్వాత ఆ అభివృద్ధికి ప్రభావితులైన అక్కినేని నాగార్జున తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా రామాపురంలో అభివృద్ధిని తీసుకొస్తానని చెప్తూ, అది తన తండ్రి నాగేశ్వరరావు కన్న కలని, దాన్ని తను పూర్తి చేస్తానని అన్నారు. 

అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీతో భేటీ అయిన నాగార్జున గుజరాత్ లో అభివృద్ధి చాలా బావుందని, మోదీ కృషి కనపడుతోందని చెప్తూ తనకి రాజకీయాలలో అభిరుచి లేదని కూడా స్పష్టం చేసారు.  మోదీతో భేటీకి ముందుగా నాగార్జున గాంధీ నగర్ కి గంట ప్రయాణపు దూరంలో ఉన్న పన్సారీ గ్రామాన్ని సందర్శించారు.  ఆ గ్రామంలో విశేషాలు ఇవి-

గ్రామంలో జనాభా సుమారు 6000 మంది.  గ్రామంలో హైఫై ఉంది.  దాన్ని ఉపయోగించుకోవటానికి నెలకి రూ.10 చెల్లిస్తే చాలు.  విద్యుత్తు 24 గంటలు లభ్యం.  పైప్ లైన్లలో త్రాగు నీరు మామూలు ఉష్ణోగ్రత లోనే కాకుండా రిఫ్రిజరేట్ చెయ్యబడ్డ శీతల జలం కూడా వస్తుంది.  రోడ్లన్నీ సిమెంటు కాంక్రీట్ చెయ్యబడ్డవే.  ఐదు పాఠశాలలు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్నాయి.  గ్రామ సర్పంచ్ గ్రామవాసులతో మాట్లాడటం కోసం పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది.  ఈ వివరాలతో మిగిలిన సౌకర్యాలు ఎలా ఉన్నాయో అంచనా వేసుకోవచ్చు. 

ఆదర్శ గ్రామాన్ని చూసిన తర్వాత నాగార్జున మోదీని ప్రశంసించారు.  మోదీ కూడా నాగార్జున గురించి మాట్లాడుతూ అంత పెద్ద స్టార్ డమ్ ఉన్నా నాగార్జున నిరాడంబరంగా ఉంటారని విన్నానని, అందుకు చాలా సంతోషమని చెప్తూ, నాన్నగారి ఆశయం మేరకు స్వగ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్న నాగార్జునకు అందుకు అవసరమైన సాంకేతిక సలహా సహకారాలను అందిస్తానని మోదీ మాటిచ్చారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles