Ram charan fire on senior director

ram charan, charan, mega ram charan, ram charan and krishna vamsi, ram charan fire on senior director, director krishna vamsi.

ram charan fire on senior director

దర్శకుడికి క్లాస్ పీకిన రామ్ చరణ్

Posted: 03/25/2014 10:01 AM IST
Ram charan fire on senior director

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లో ఆవేశం ఒక్కసారిగా కట్టలుతెంచుకుంది. దీంతో  దర్శకుడికి క్లాస్ పీకినట్లు సమాచారం. ఇప్పుడు  రామ్ చరణ్ పొలాచ్చి షూటింగు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దర్శకుడు కృష్ణవంశీ  చెప్పిన కథ కు,  షూటింగు చేసేవిధానానికి  చాలా తేడా ఉండటంతో  రామ్ చరణ్  మండిపడినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మొదట్లో తన ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకుని ఎంటర్‌టైన్‌ చేసిన కృష్ణవంశీ రాను రానూ పూర్తిగా కంట్రోల్‌ తప్పాడు. అందుకే అతని సినిమాలు కూడా అలా తలా తోకా లేకుండా తయారవుతున్నాయనే టాక్  టాలీవుడ్ లో ఉంది. 

 ఈ చిత్రంలోను కృష్ణవంశీ మార్కు 'పైత్యం' బాగానే ఉందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. కుటుంబం, సమాజం, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అంటూ ఇందులో కూడా కృష్ణవంశీ తన మోరల్‌ సైన్స్‌ పాఠం మొదలు  పెట్టినట్లు తెలుస్తోంది. అసలే ఈ సినిమాపై ఎవరికీ నమ్మకాలు లేవని వర్రీ అవుతున్న రామ్ చరణ్  ఫాన్స్‌ ఇలాంటి న్యూస్‌ ఇంకా కంగారు పడుతున్నారు. 

అసలు యువ దర్శకుల్ని కాదనుకుని మరీ చరణ్‌ ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. నాగార్జున పలుమార్లు రిజెక్ట్‌ చేసిన సబ్జెక్ట్‌ని రామ్‌ చరణ్‌ ఓకే చేసిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడి  తీరు పై మండిపడిన  రామ్ చరణ్ , త్వరగా ఈ సినిమాను  పూర్తి చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles