Mega power star ram charan to be seen in panche kattu

Ram Charan, Krishna Vamsi, Panche Kattu, Ram charan panche kattu, Ram Charan will be seen in treditional

Mega power star Ram Charan to be seen in Panche Kattu, Ram Charan will be seen in treditional

విలేజీలో ప్యాంట్ విప్పేసిన రామ్ చరణ్ ?

Posted: 03/24/2014 06:04 PM IST
Mega power star ram charan to be seen in panche kattu

ప్యాంట్ విప్పేసిన రామ్ చరణ్. అంటే మీరు మరోలా అనుకోకండి. కొత్తగా కనిపించటం కోసం తన స్టైల్ ను మార్చుకున్నాడు. ఇన్నాళ్లూ ప్యాంట్, షర్ట్ వేసుకుని మోడ్రన్ హెయిర్ స్టయిల్ తో స్టయిలిష్ గా కనిపించిన రామ్ చరణ్ ఇప్పుడు సరికొత్త గెటప్పులో కనిపించనున్నాడు. తొలిసారిగా పల్లెటూరి కుర్రాడిగా తన ఆహార్యాన్ని మార్చుకున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో చరణ్ మనకిలా విభిన్నంగా కనిపిస్తాడు.

పల్లెటూరి యువకుడిగా పంచెకట్టుతో మనకు దర్శనమిస్తాడు. అప్పటి వరకు విదేశాల్లో గడిపిన చరణ్ తన తాతగారి ఊరు వచ్చాక, తన రూపాన్ని మార్చేసుకుని, పోనీటైల్ తో పంచెకట్టుకట్టి ... ఎడ్లబండిపై తిరుగుతూ గ్రామీణ యువకుడిని మరపిస్తాడని అంటున్నారు. 

తాత పాత్రధారి రాజ్ కిరణ్, చరణ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు మంచి హాస్యంతో ప్రేక్షకులని అలరిస్తాయట.య క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో శ్రీ కాంత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ప్రస్తుతం పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కమలిని ముఖర్జీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.   రామ్ పంచకట్టు న్యూ లూక్  చాలా బాగుందని  చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles