Ram gopal varma angry on mohan babu

ram gopal varma, varma, mohan babu, jayasudha, Rowdy movie, ram gopal varma angry on mohan babu, rowdy movie release date, rowde movie review.

ram gopal varma angry on mohan babu

వర్మ కు మోహన్ బాబు అంటే చాలా కోపం?

Posted: 03/21/2014 12:30 PM IST
Ram gopal varma angry on mohan babu

సంచల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ,  వివాదాల నటుడు మోహన్ బాబు.  ఈ ఇద్దరు కలిస్తే.. కనబడేది రౌడీలే.  ఈ  ఇద్దరు మీడియా కు, సినీ ప్రజలకు బాగా  పరిచయం ఉన్నవారే.  వర్మ తనకు వచ్చిన ప్రతి సందర్బాన్ని తనకు అనుగుణంగా మార్చుకోవడంలో మంచి పేరున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. 

తన వివాదాస్పద వ్యాఖ్యలతో, రెచ్చగొట్టే ప్రకటనలతో తన సినిమాలకు మంచి ప్రచారం చేసుకునే ఈ దర్శకుడు, ఇటివల జరిగిన ‘రౌడీ’ ఆడియో విడుదల కార్యక్రమంలో నటుడు మోహన్ బాబుపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్మ మాట్లాడుతూ,’నాకు మోహన్ బాబు అంటే ద్వేషం’, అని అన్నారు. అయితే దీనికి కారణం కూడా వర్మ వివరించాడు.

‘నాకు నటి జయసుధ అంటే చాల ఇష్టమని, కానీ ‘శివరంజని’ సినిమాలో మోహన్ బాబు జయసుధని చాలా ఇబ్బందులకు గురిచేసాడని, అందుకనే నాకు మోహన్ బాబు అంటే చాలా కోపం’, అని అయన అన్నారు.  మోహన్ బాబుతో పాటు జయసుధ కూడా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles