Vikram replacing pawan kalyan in oh my god movie

Pawan Kalyan, Oh My God movie remake, Vikram, venkatesh, oh my god, pawan party.

Vikram replacing Pawan Kalyan in Oh My God movie

అపరిచితుడు ఎంట్రీతో - పవన్ అవుట్ ?

Posted: 03/15/2014 07:18 PM IST
Vikram replacing pawan kalyan in oh my god movie

అపరిచితుడు రాకతో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బయటకు పంపించే పనిలో  ఓ మై గాడ్ పెద్దలు ఉన్నట్లు  సమాచరం. పవన్ రాజకీయలతో  బిజీ కావటంతోనే ఈ  నిర్ణయం తీసుకున్నట్లు  తెలుస్తోంది.  అపరిచితుడు అంటే తెలియని వ్యక్తని అర్ధం కాదు. 

అపరిచితుడు సినిమా హీరో విక్రం అని అర్ధం. పవన్ కళ్యాణ్ తన గబ్బర్ సింగ్ 2 సినిమాతో పాటు.. వెంకటేష్ తో మల్టీ-స్టారర్ సినిమాగా హిందీ ఓ మై గాడ్ రీమేక్ సినిమాకు కూడా డేట్స్ ఇచ్చాడు. ప్రస్తుతానికి ఆ సినిమా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాను వెంకీ సొంత సంస్థ సురేష్ ప్రొడక్షన్ తో పాటు పవన్ స్నేహితుడు శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నాడు. 

అయితే వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్ళనుండగా ఇప్పుడు పవన్ రాజకీయలలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు వచ్చేనెల నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారానికి కూడా వెళ్లనున్నాడట. దీంతో ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏమిటా అని నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. ఒకవేళ పవన్ ఈ సినిమానుండి తప్పుకుంటే.. అపరిచితుడు సినిమాతో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో విక్రం ఆ పాత్రను ఒకే చేయాలని చూస్తున్నట్లు టాలీవుడ్ టాక్. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles