Akkineni family manam movie postponed

Akkineni family Manam movie postponed, Akkineni Family Manam Movie release date, Akkineni heros, akkineni family multi starer movie,

Akkineni family Manam movie postponed, Akkineni Family Manam Movie release date, Akkineni heros, akkineni family multi starer movie,

‘మనం ’ ఉగాదికి రావడం లేదు

Posted: 03/11/2014 06:37 PM IST
Akkineni family manam movie postponed

అక్కినేని ఫ్యామిలీ త్రయం కలిసి నటించిన ‘మనం ’ సినిమా ఆ ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకం ఎందుకంటే  ‘నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ’ నటించిన చిట్ట చివరి చిత్రం కాబట్టి. ఈ సినిమాను తెలుగు సంవత్సరాది ఉగాదికి అంటే మార్చ్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తామని ఆ చిత్ర నిర్మాత, నటుడు నాగార్జున అఫీషియల్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు.

కానీ ఇప్పుడు ఆ సినిమా విడుదల వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట అనుకున్న ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడమే ఈ చిత్ర విడుదలకు జాప్యం అని తెలుస్తుంది. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఈ సినిమాను ఇరవై రోజుల నుండి ముప్పై రోజుల వరకు పోస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు చిత్ర యూనిట్ వర్గాల వారు చెబుతున్నారు.

మొదట ప్రకటించిన సినిమా విడుదల తేదీ రోజున ఆడియోను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. పైకి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు లేట్ అని చెబుతున్నా, ఆ సినిమా కంటే రెండు రోజుల ముందు బాలయ్య ‘లెజెండ్ ’ సినిమా ఉంది కాబట్టి, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న దీనిని జనాలు ఆదరించరనే ఉద్దేశ్యంతో పొస్ట్ పోన్ చేసి ఉంటారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles