Legend telugu movie poster released

Legend Telugu Movie poster released, Nandamuri Balakrishna Legend movie, Director Boyapati Srinu, Balayya Legend movie

Legend Telugu Movie poster released

బాలయ్య లెజెండ్ ప్రచార చిత్రం విడుదల

Posted: 03/02/2014 12:21 PM IST
Legend telugu movie poster released

నందమూరి బాలకృష్ణతో సింహాను తలదన్నే చిత్రాన్ని, దాన్ని మరిపించే చిత్రాన్ని రూపొందిస్తున్న అదే చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను మార్చి 28 న విడుదల చెయ్యబోతున్న లెజెండ్ చిత్ర పోస్టర్ ని విడుదల చేసారు.  

రామ్ అచంట, గోపీ అచంట, అనిల్ సుంకర సమిష్టి నిర్మాణంలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్, వారాహి చలన చిత్రం పతాకాల కింద రూపు దిద్దుకుంటున్న లెజెండ్ ని సాయి కొర్రపాటి సమర్పిస్తున్నారు.  కధానాయకుడు బాలకృష్ణతో పాటుగా ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు, నాయికా సహాయక పాత్రలలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్, కళ్యాణి ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.  

ఈ చిత్రం ఈమధ్యనే దుబాయ్ లో కార్ ఛేజ్ లు పోరాట దృశ్యాలతో కూడిన సుదీర్ఘమైన షెడ్యూల్ ని పూర్తిచేసుకుని వచ్చింది.  పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా సాగిపోతున్నాయి.  ఇది బాలకృష్ణ సినీ జీవితంలో అతి పెద్ద బడ్జెట్ తో నిర్మించబడుతోంది.  జెమిని టివి ఇప్పటికే 8.5 కోట్ల తో ఈ చిత్రం శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది.

లెజెండ్ చిత్రం మీద బాలకృష్ణ అభిమానుల అంచనాలు పెద్ద స్థాయిలోనే ఉన్నాయి.   ఈ చిత్రం సినీ జీవితంలోనే కాక బాలకృష్ణ రాజకీయ జీవితంలో కూడా మార్పుని తీసుకురావొచ్చని అనుకుంటున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles