Pawan walk at necklace road on 2nd march

Pawan Kalyan charity walk, Trivikram Srinivas charity walk, Pawan Kalyan and Trivikram srinivas charity walk, Hrudaya Spandana Foundation, WALK FOR HEART, Prajahitha Social Welfare organisation,Necklace Road

Power star Pawan Kalyan participate in social service on March 2nd at necklace road in Hyderabad at Hrudaya Spandana Foundation.

హృదయ స్పందన ఫౌండేషన్ కోసం పవన్

Posted: 02/12/2014 06:01 PM IST
Pawan walk at necklace road on 2nd march

హీరో పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ఎలాంటి కార్యక్రమాలకు హాజరయ్యేవాడు కాదు. అప్పుడప్పుడు మాత్రమే కొన్ని సినిమా ఫంక్షన్లకు హాజరయ్యే ఈయన ఇటీవలి కాలంలో సినీ, సామాజిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వెళ్లి అలరించడమే కాకుండా తన అమూల్యమైన సందేశాలతో ఆకట్టుకుంటున్నాడు. బేసిగ్గా మంచి మనసు, సమాజ సేవ చేయాలనే తపన కలిగిన పవన్ ఓ చారిటీ వాక్ కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరించాడు.

ఈయన హైదరాబాదుకి చెందిన ‘హృదయ స్పందన ఫౌండేషన్ ’ వారు మార్చ్ 2న నిర్వహించే నడకలో పవన్ పాల్గొన బోతున్నాడు. మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నడక ఉత్తమమని చాటి చెబుతూ ఈ వాక్ చేయబోతున్నాడు. ఆ రోజు  ఉదయం నెక్లస్ రోడ్డులో జరిగే కార్యక్రమంలో ఈయనతో పాటు తన స్నేహితుడు, దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పాల్గొన బోతున్నాడు.

పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఆ రోజు నెక్లెస్ రొడ్డు కిటకిట లాడటం ఖాయం. పవన్ చేస్తున్న ఈ సామాజిక కార్యక్రమం విజయవంతం అయ్యి, నలుగురికి స్ఫూర్తి నివ్వాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles