Bhimavaram bullodu movie few bits reshoot

Bhimavaram Bullodu reshoot, sunil, uday shankar, bheemavaram bullodu, suresh productions,

Bhimavaram Bullodu movie has and would be going for a series of reshoots.

‘భీమ వరం బుల్లోడు ’ మరింత వెనక్కి ?

Posted: 01/27/2014 10:10 AM IST
Bhimavaram bullodu movie few bits reshoot

కమేడియన్ స్థాయి నుండి హీరో ఎదగిన సునీల్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘భీమవరం బుల్లోడు ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది.

మొదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నా, పెద్ద హీరోల సినిమాల కారణంగా దీనిని ఈనెల చివరి వారంలో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. కానీ దీనికి సంబంధించిన తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. కారణం ఏంటంటే ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారట. కొన్ని సన్నివేశాలు అనుకున్న విధంగా రాకపోవడంతో నిర్మాత, సునీల్ దర్శకుడి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం వల్లే వాటిని మళ్లీ చిత్రీకరిస్తున్నారని అంటున్నారు.

ఈ సన్నివేశాల చిత్రీకరణ అనంతం విడుదల తేదీని ప్రకటిస్తారని తెలుస్తుంది. కానీ కొంత మంది సినీ జనాలు మాత్రం పూరీ జగన్నాథ్ హార్ట్ ఎటాక్ సినిమా కారణంగానే వాయిదా వేశారని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles