Varun tej debut film postponed to february

Varun Tej debut in feb, Varun Tej, telugu movie,varun tej debut,Varun Tej,Tollywood,SrikanthAddala, Mickey J Meyer, Nallamalupu Bujji, Tagore Madhu, SVSC director Srikanth Addala,

Varun Tej launch event on 1st January, which is now postponed to February and the exact date is yet to be finalized.

ఫిబ్రవరిలో రావటం ఖాయం ?

Posted: 01/04/2014 01:47 PM IST
Varun tej debut film postponed to february

టాలీవుడ్ లో మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తాడా అని గత కొన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్న మెగా హీరో నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ వెండితెర అరంగ్రేటం వచ్చే నెలలో ఉండబోతుందని సమాచారం.దీంతో గత కొన్ని రోజుల నుండి ఈయన ఎంట్రీ పై ఉన్న సస్పెన్స్ తొలగిపోయింది.

గతంలో పూరి జగన్నాథ్, క్రిష్, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించబోతున్నాడని, దానికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయని, షూటింగు ప్రారంభమే తరువాయి అని ప్రచారం జరిగింది.చివరకు పూరి జగన్నాథ్, క్రిష్ లు తప్పుకొని చివరకు శ్రీకాంత్ అడ్డాలనే వరుణ్ తేజ్ ను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నాడు. ఇక ఈ సినిమా షూటింగును మొదట జనవరి 1 వ తేదీనే గ్రాండ్ గా ప్రారంభోత్సవం చేస్తారని ప్రచారం జరిగింది.

కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఈ సినిమాను ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు. కానీ ఏ తేది అనేది మాత్రం ఖరారు చేయలేదు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించబోతున్నా ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని నల్లమల్లపు శ్రీనివాస్ (బుజ్జీ), మధులు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరిలోనైనా సెట్స్ పైకి వెళుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles