Mahesh1 movie creates new youtube record

1-Nenokkadine trailer new record, Super Star Mahesh Babu, 1-Nenokkadine, News, Mahesh Babu, Devi Sri Prasad, New Youtube Record, 5 Lakh viewers, inderstury breaking records

Super Star Mahesh Babu recent released 1-Nenokkadine trailer is breaking records and is on the way to set new records. Within 24 hours more than 5 Lakh viewers viewed this trailer in YouTube.

24 గంటల్లో 5 లక్షలు-కొత్త రికార్డ్

Posted: 01/03/2014 11:54 AM IST
Mahesh1 movie creates new youtube record

టాలీవుడ్ లో ఇటీవలి కాలంలో విడుదల అవుతున్న స్టార్ హీరోల ట్రైలర్లు యూ బ్యూట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ సినిమా పై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. అయితే దర్శకులు సినిమా పై హైప్ పెంచడానికి ఇలాంటి ట్రైలర్లు విడుదల చేసి, తీరా సినిమాకెళ్తే అందులో మేటర్ లేనివి కూడా ఉన్నాయి.

వాటి సంగతి ప్రక్కన పెడితే తాజాగా టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో నటించిన ‘1’ నేనొక్కడినే సినిమాకు సంబంధించిన కొత్త ట్రైలర్ ని న్యూ ఇయర్ కానుకగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడు కొత్త రికార్డును క్రియేట్ చేసింది. దీనిని విడుదల చేసిన 24 గంటల్లోనే 5 లక్షల మంది దీనిని చూశారు.

ఇప్పటి వరకు ఇంత తక్కువ టైంలో ఏ హీరో ట్రైలర్ కి ఇన్ని వ్యూస్ రాలేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికే బిజినెస్ పరంగా, రైట్స్ పరంగా కొత్త రికార్డులు నెలకొల్పుతున్న ఈ సినిమా యూ ట్యూబ్ లో స్రుష్టించిన కొత్త రికార్డుతో సినిమా పై మరిన్ని భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తొలిసారి తన కొడుకుతో కలిసి మహేష్ నటిస్తున్న చిత్రం కాబట్టి ఆయన అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.

ప్రస్తుతం ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మనకందుతున్న సమాచారం ప్రకారం నేడు ఈ సినిమా సెన్సార్ ముందుకు వెళ్ళబోతుందని తెలుస్తుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles