Anushka personal news

anushka personal news, Anushka Personal Interview, Anushka telugu movies list, Anushka movie,

anushka personal news

అనుష్క లో వేడిని త్వరగా క్యాష్ చేసుకోవాలి?

Posted: 12/05/2013 10:24 AM IST
Anushka personal news

బెంగుళూర్ బేబి కి హీరోతో పనిలేదు. హీరో లేకుండానే తన సినిమాను హిట్ చేయగల సత్తా బెంగళూర్ బొమ్మాలి ఉందని గతంలో నిరూపించింది. అయితే అనుష్క లో వేడిని క్యాష్ చేసుకోవటానికి కొంత మంది నిర్మాతలు , దర్శకులు రెఢీ అవుతున్నారు. అందుకోసం పాత పుస్తకాలకు పట్టిన బూజును దులిపి కథలు రేఢీ చేస్తున్నారు. అయితే ఇది విషయాన్ని బొమ్మాలి ముందు ఉంచితే. అబ్బే అలాంటిది ఏమీ లేదు అని నవ్వుతూ సమాధానం చెబుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ బాగా బిజీ బిజీ గా ఉన్న హీరోయిన్ అనుష్క. ఆమె ఒకేసారి ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ అనే రెండు పీరియడ్ డ్రామా సినిమాల్లో నటిస్తోంది.

 

దాదాపు హీరోలతో సమానంగా పేరు తెచ్చుకున్న అనుష్క కోసం ఎంతో మంది లేడీ ఓరియెంటెడ్ కథలని ప్రిపేర్ చేస్తున్నారు, అలాగే నిర్మాతలు కూడా అనుష్కతో భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఇదే విషయాన్ని అనుష్క ముందు ఉంచితే ‘ నిర్మాతలు నన్ను నమ్ముకొని భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు చేస్తారనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అలాంటి సినిమాలు చేయాడానికి కథే కీలకం.

 

ఎంతపెద్ద స్టార్స్ ఉన్నా కథ లేకపోతే సినిమా వృధా అవుతుంది. కావున కేవలం నన్ను నమ్మి కొన్ని కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారనడంలో నిజం లేదు. శ్యాం ప్రసాద్ రెడ్డి గారు నన్ను నమ్మి అరుంధతి సినిమా చేయలేదు. కథను నమ్మి ఆ కథకు నన్ను ఎంచుకున్నారు. కావున ఏ సినిమాకైనా కథే ముఖ్యంమని’ అనుష్క సమాధానం ఇచ్చింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles