Attarintiki daredi collections drops new scenes added soon

attarintiki daredi, box office collection, new scenes added, box office collections 27 day, second off new scenes

Attarintiki Daredi Box Office Collection Drops on 27th day, New Scenes to be Added Soon.

అత్తారింటికి కలెక్షన్లు డ్రాప్

Posted: 10/24/2013 05:56 PM IST
Attarintiki daredi collections drops new scenes added soon

టాలీవుడ్ ఇండస్ట్రీ రోజుకో కొత్త పంథాను అనుసరిస్తూ పోతుంది. అద్దూ పద్దూ లేకుండా పెట్టుబడి పెట్టి, అత్యథిక థియేటర్లలో సినిమాలను విడుదల చేసి పెట్టిన దానికి రెట్టింపు వసూళ్ళు చేసుకుంటున్నారు. ఇక సినిమా బాగుందనే టాక్ వస్తే మరిన్ని డబ్బులు దండుకోవడానికి ఓ ట్రిక్కు కనిపెట్టారు.

సినిమా లెన్తీగా ఉంటే ల్యాబ్ కత్తిరించిన సీన్లను మళ్లీ అతికించడం ఈ మద్య కాలంలో ఎక్కువైంది. మిర్చి సినిమా 50 రోజుల తరవాత వాన ఫైటు ఒకటి యాడ్‌ చేశారు. దాంతో ఆ సినిమాకి ఇంకాస్త మైలేజీ వచ్చింది. ఇప్పుడు అత్తారింటికి దారేది సినిమాకీ అదే సీను. ఈ సినిమా 25 రోజులు పూర్తి చేసుకొంది. ఇప్పుడీ సినిమాలో కొత్త సీన్లు కలుస్తున్నాయి. విడుదల అయిన 25 రోజులకే టాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసిన ఈ సినిమా కు మళ్లీ ప్రేక్షకుల్ని రప్పించేదుకు సెకండాఫ్‌ లో కత్తిరించిన బ్రహ్మానందం సీన్‌ని మళ్లీ అతికిస్తున్నారట.

ఆ సీన్‌ దాదాపు ఏడు నిమిషాలుంటుందని టాక్‌. ముప్పైవ రోజు త తరవాత నుండి ఈ సీన్లు తెర పై కనిపిస్తాయని చెబుతున్నారు. అయితే కలెక్షన్లు డ్రాప్ అవ్వడంతోనే ప్రేక్షకులను థియేటర్లను రప్పించడానికి ఈ ప్లాన్ వేశారని అంటున్నారు సినీ జనాలు. అసలే వందకోట్ల ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఈ సీన్లతో ఆ మార్క్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh