Amala paul has no time for bollywood movie

Amala Paul reject bollywood, amala paul, bollywood, akshay kumar, gabbar, ramana, director krish

mala Paul has turned down a huge offer to star opposite Akshay Kumar in his upcoming film Gabbar.

అమలాపాల్ ఆయనతో చేయనంది

Posted: 10/10/2013 06:55 PM IST
Amala paul has no time for bollywood movie

   టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే లైన్లోకి వస్తున్న ముద్దుగుమ్మ అమలాపాల్ తన వల్ల కాదని చేతులెత్తేసి, చేజేతులా చేజార్చుకుంది బాలీవుడ్ అవకాశాన్ని. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా, తమిళం లో కూడా నటిస్తున్న అమలాపాల్ కి బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సరసన చేయమని అడిగారు. తెలుగు లో సూపర్ హిట్ అయిన ‘ఠాగూర్ ’ సినిమాను హిందీలో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో అమలాపాల్ ని చేయమని అడిగితే.. అబ్బో నా వల్ల కాదు...సారీ అండీ అంటూ ప్రస్తుతం మీతో చేయడానికి టైంలేదు చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని చెప్పుకుందట.

   సాధారణంగా బాలీవుడ్ లో అవకాశాల కోసం పడరాని పాట్లు పడుతున్న ఇక్కడి భామలు అవకాశం వస్తే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. కానీ అమలా కాళ్ళ దగ్గరికి వచ్చిన అవకాశాన్ని ఎందుకు రిజెక్ట్ చేసిందో అని సినీ జనాలు ఆరా తీస్తే అసలు విషయం వేరే ఉందని తేలిసిందట. ఈ సినిమాలో అమ్మడుకు సెకండ్ హీరోయిన్ పాత్ర కట్టబెట్టడంతో దీన్ని తిరస్కరించిదని తెలియడంతో, బాలీవుడ్ లో అవకాశం రావడమే గొప్ప, అలాంటిది అక్కడ ఒకటా, రెండా అని చూడటం దేనికి, ఆ మధ్య తెలుగులో సెకండ్ హీరోయిన్ గా చేసింది కదా ? కాస్తంత రేంజ్ పెరిగినంత మాత్రాన ఇంత బిల్డప్ అవసరమా అని ఆమె సన్నిహితులు  అనుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles