Hero nagarjuna is entering in to film distribution

Hero Nagarjuna is entering in to film distribution, Annapurna Studios into distribution business, Annapurna Studios in to Film Distribution with Bhai movie.

Annapurna Studios is starting its first film distribution office at Vizag on 22nd August.

డిస్టిబ్యూటర్ గా మారిన నాగార్జున

Posted: 08/22/2013 12:43 PM IST
Hero nagarjuna is entering in to film distribution

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏఎన్నార్  నుండి నట వారసత్వాన్ని అంది పుచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగిన నాగార్జున హీరోగానే కాకుండా వ్యాపార రంగంలో బాగా రాణిస్తున్నారు. ఐదు పదుల వయస్సు దాటినా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండే నాగార్జున ఇప్పటికే అనేక వ్యాపారాలు ప్రారంభించాడు. నిర్మాతగా, ఫిలిం స్టూడియో,  ఫిలిం స్కూల్ అధినేతగా మంచి సక్సెస్ అయిన అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ గ్రూప్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగుపెట్టబోతుంది. వైజాగ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఓ పంపిణీసంస్థను ఆయన ప్రారంభించారు. తను హీరోగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భాయ్’ చిత్రంతో ఈ పంపిణీసంస్థ శ్రీకారం చుట్టుకోనుంది. త్వరలో ఇతర ఏరియాల్లో కూడా పంపిణీ శాఖలను ప్రారంభించాలనుకుంటున్నామని నాగార్జున ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే సినిమా రంగంలో పలు శాఖల్లో అనుభవం ఉన్న అన్నపూర్ణ గ్రూపుకు డిస్ట్రిబ్యూషన్ చేయడం పెద్ద పనేం కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles