Puri jagannath nitin idiot 2

Puri Jagannath Heart Attack as Idiot 2, Puri jagannath Idiot 2 with nitin, puri jagannath to direct nithin, nitin heart attack movie details, puri jagannath heart attack as idiot 2.

Puri Jagannath Heart Attack as Idiot 2, Puri jagannath Idiot 2 with nitin, puri jagannath to direct nithin, nitin heart attack movie details, puri jagannath heart attack as idiot 2.

ఈ సినిమా ఇడియట్ కి సీక్వెలా ?

Posted: 07/06/2013 05:42 PM IST
Puri jagannath nitin idiot 2

టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ ప్లాపు చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్  సినిమాలు గత కొంత కాలంగా బొల్తా పడుతున్నాయి. కారణం సరైన స్టోరీ, స్ర్కిప్టు లేకుండా ఏదో పని పూర్తి చేశామా నాలుగు డబ్బులు తీసుకున్నామా అట్లుగా వ్యవహరించడమే ఈయన్ని దెబ్బకొట్టింది. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ తో తీసిన ‘ఇద్దరమ్మాయిలతో ’ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో కాస్తంత వెనక్కి తగ్గిన పూరీ ఆచితూచి అడుగు వేసి తన పాత క్రేజ్ ని సంపాదించుకోవాలనే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లున్నాడు. అందులో భాగంగానే మళ్ళీ ఫాంలోకి వచ్చిన నితిన్ ని పెట్టి ఓ సినిమా తీయాలని డిసైడ్ అయ్యి పక్కా స్ట్రిప్టు రెడీ చేసుకొని ‘హార్ట్ ఎటాక్ ’ అనే టైటిల్ ని కూడా అనౌన్స్ చేశాడు.

ఇంత వరకు బాగానే ఉన్నా వీరిద్దరి కాంబినేషన్లో రూపొందబోయే సినిమా పూరి కెరియర్ కి మంచి పేరు తీసుకొచ్చిన ఇడియట్ సినిమాకు సీక్వెల్ గా తీయబోతున్నాడనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. తానే స్వయంగా రంగంలోకి దిగి తన సొంత బ్యానర్ వైష్ణో అకాడమీలో ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఇడియట్ కూడా వైష్ణో అకాడమీలో వచ్చి మంచి హిట్ సాధించింది. గతంలోనే చాలా సార్లు ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నాడని వార్తలు వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ యంగ్ హీరోతో దీన్ని పూర్తి చేయబోతున్నాడని అంటున్నారు. ఇక ఇప్పటికే కమీట్ అయిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ చిత్రం ‘అందగాడు ’ ని సైతం పక్కన పెట్టి దీన్ని పట్టాలెక్కిస్తున్నాడంటే పూరీ ఫూర్వ వైభవం కోసం ఎంత ప్రయత్నిస్తున్నాడో ఇట్టే అర్థం అవుతుంది. చూద్దాం నితిన్ - పూరి కాంబినేషన్ పూర్వ వైభవం తెస్తుందో ? లేక ప్రేక్షకులకు హార్ట్ ఎటాక్ తెస్తందో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles