Waiting for the day of shruti hassan

Shruti Hassan in D- Day,Shruti Hassan, Shruti Haasan in D Day , shruthi hassan new movies, shruthi hassan new movies release, july 19th,

Waiting for the day of shruti hassan

ఆ రోజు కోసం ఎదురుచూస్తున్న శ్రుతి

Posted: 06/25/2013 03:23 PM IST
Waiting for the day of shruti hassan

ఆమె అడుగును మొదట్లో ఐరన్ లెగ్ అన్నారు. ఇప్పుడు అదే లెగ్ ను గోల్డ్ లెగ్ అంటున్నారు. మొదట్లో అన్ లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నా ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ లలో దూసుకుపోతోంది శ్రుతిహాసన్. ఆమె బాలీవుడ్ లో నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల తేదీలు పెట్టుకోవటమే అందుకు తార్కాణం. ఆ చిత్రాలు 'డి-డే', 'రామయ్యా వస్తావయ్యా' . ఈ విషయమై శృతిహాసన్ మాట్లాడుతూ... నేను బాలీవుడ్‌లో తాజాగా నటించిన 'డి-డే', 'రామయ్యా వస్తావయ్యా' సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. జులై 19న ఈ రెండు చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అందుకే ఆ రోజు కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంది. 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం అయితే తెలుగులో సూపర్ హిట్టైన నువ్వు వస్తానంటే..నే వద్దంటానా రీమేక్. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రంపైనా మంచి అంచనాలే ఉన్నాయి. నిఖిల్‌ అద్వానీ దర్శకత్వంలో రూపొందిన 'డి-డే'లో శృతి హాసన్ వేశ్య పాత్రను పోషించింది. అర్జున్‌ రామ్‌పాల్‌ - శ్రుతిల మధ్య ఘాటైన సన్నివేశాలున్నాయని సమాచారం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే హాట్ టాపిక్ గా మారి సినిమాకు బోల్డ్ క్రేజ్ తెచ్చిపెట్టింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles