Director rajamouli comments on baahubali

director rajamouli, comments, cinema become indias greatest movie, actress and heroine anushka, villan hero rana, baahubali movie

director rajamouli, comments, cinema become indias greatest movie, actress and heroine anushka, villan hero rana, baahubali movie

ప్రభాస్ క్యారెక్టర్ ఇదే

Posted: 06/15/2013 08:13 PM IST
Director rajamouli comments on baahubali

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలీవుడ్ హీరో రాణా విలన్ గా అనుష్క ప్రధాన పాత్ర ధారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ తో దాదాపు 100 కోట్లతో ఆర్కా మీడియా పతాకం పై జానపద చిత్రంగా రూపొందబోతున్న ఈ చిత్రం పై టాలీవుడ్ లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ చిత్రానికి సంబందించిన వార్తలు రోజుకు ఒకటి బయటకి వస్తూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రంలో ప్రభాస్ చేయబోయే పాత్ర ఎలా ఉండబోతుందేమోనని ఆసక్తిగా ఉండేది. అంతే కాకుండా ప్రభాస్ రోల్ ని రెండు షేడ్స్ లో చూపిస్తారన్న ప్రచారం కూడా జరగడంతో తాజాగా రాజమౌలి ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందో నాలుగు మాట్లల్లో వివరించాడు. ‘ఇచ్చిన మాట కోసం బంధాలను, బాంధవ్యాలను కూడా లెక్కచేయని మేరుగనగధీరుడు ‘బాహుబలి'. మాట తప్పడం, మడమ తిప్పడం తనకు తెలియదు. తెలిసి ఒక్కటే...రాక్షస అలలకు ఎదురీదడం. రాచరిక అహంభావాన్ని కూకటి వేళ్లతో పెకిలించడం. శత్రుదుర్భేధ్యమైన పద్దెనిమిది అక్షౌహిణిల సైన్యంతో అతనొక్కడే సమానం'....ఈ విధంగా రాజమౌళి బాహుబలి(ప్రభాస్) పాత్రను మలిచాడట. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం కోసం గుర్రపుస్వారి, కత్తియుద్ధం, ధనుర్విద్య, కర్రసాము లాంటి విద్యలను ప్రభాస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్ర్కిప్టు వర్క్, భారీ సెట్టింగ్ పనులు జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vaishnav tej to make acting debut with uppena his first look poster raises curiosity

    ‘ఉప్పెన’లా దూసుకెళ్తున వైష్ణవ్‌ తేజ్..

    Jan 23 | సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న... Read more

  • Tollywood comedian sunil admitted to hospital for sinusitis

    నటుడు సునీల్ కు అస్వస్థత…. అభిమానుల్లో ఆందోళన

    Jan 23 | టాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్‌ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. హీరో... Read more

  • Allu arjun s uncle rajendra prasad passes away in vijaywada

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం..

    Jan 23 | ‘అల వైకుంఠపురంలో’ సూపర్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ గుండెపోటుతో మరణించారు. విజయవాడలోని ఆయన నివాసంలో బుధవారం ప్రసాద్‌ కన్నుమూశారు. అల్లు... Read more

  • Super star rajinikanth s darbar joins 200 crore club

    రూ.200 కోట్ల క్లబ్ లోకి రజనీ ‘దర్భార్’.!

    Jan 22 | సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఖాతాలో మరో రూ.200 కోట్ల సినిమా చేరింది. ఆయన పోలీసు అధికారిగా నటించిన సినిమా ‘దర్బార్‌’. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. నయనతార, నివేదా థామస్‌, సునీల్‌ శెట్టి, యోగిబాబు తదితరులు దీనిలో... Read more

  • Allu arjun s ala vaikunthapurramuloo 10 days share 143 not out

    అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ రికార్డ్ ‘అలా వైకుంఠపురంలో’.!

    Jan 22 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు వద్ద తెగ సవ్వడి చేస్తోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 220 కోట్ల క్లబ్ లో చేరి... Read more

Today on Telugu Wishesh