Viswaroopam movie release in theaters first

viswaroopam movie, kamal hassan viswaroopam, kamal dth operaters, kamal theater owners, viswaroopam movie teaser, viswaroopam movie release, viswaroopam movie wallpapers, viswaroopam movie casting, viswaroopam movie crew, viswaroopam release in theaters first

viswaroopam movie release in theaters first

1.gif

Posted: 01/12/2013 10:58 AM IST
Viswaroopam movie release in theaters first

ee

       నిర్మాతల కౌన్సిల్, తమిళనాడు ధియేటర్ యజమానుల సంఘం, పంపిణీదారులతో జరిపిన చర్చలు ఫలప్రదం కావటంతో కమల్ తేలికబడ్డాడు. ఇంతకాలం డీటీహెచ్ గొడవతో మానసిక ఆందోళనకు గురైన కమల్ వెనకడుగు వేయటంతో ఈ ఫలితం దక్కింది. ఫలితంగా కమల్ ప్రతిష్టాత్మక ‘విశ్వరూపం’ సినిమా ప్రదర్శన మొదట థియేటర్ల లోనే జరుగుతుంది. తర్వాతి రోజు మాత్రమే డీటీహెచ్ లో ప్రసారం చేస్తారు. సుహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ  సమావేశంలో థియేటర్ల సంఘం సభ్యులు 'విశ్వరూపం' సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, కమల్ కు బంగారు ఉంగరాన్ని బహూకరించారు. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లైంది. (సరికొత్తగా ‘విశ్వరూపం’ సినిమాని మొదట డీటీహెచ్ ప్రసారాల ద్వారా నేరుగా ఇండ్లలోకి సినిమాని రిలీజ్ చేయాలని కమల్ భావించిన సంగతి తెలిసిందే)
       ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ, తన యుక్త వయస్సు నుంచి మీరంతా తనకెంతో తోడుగా ఉన్నారని, మీ అందరి ప్రోత్సాహంతోనే తాను ఇంతగా ఎదిగానని అన్నారు.  తాను గత మూడు రోజులుగా నిద్రకు దూరమయ్యానని, ఈ సమావేశానంతరం హాయిగా నిద్రపోతానని వెల్లడించారు.
          కాగా,  ఈ నెల 25 న తమిళనాడులోని 500 ధియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇక డీటీహెచ్ లో 28 న ప్రసారం చేసే అవకాశం కనిపిస్తుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Life of pi movie oscar nominations
Charan naayak movie record collections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles