Maniratnam kadali telugu audio release function

maniratnam kadali, kadali telugu movie, kadali telugu audio, kadali audio release function, maniratnam, ar rahman, heroine tulasi, heroine radha, hero arjun, hero karthik, hero gowtham, kadali teaser, kadali wallpapers

maniratnam kadali telugu audio release function

11.gif

Posted: 01/11/2013 03:06 PM IST
Maniratnam kadali telugu audio release function

kadali-audio-function_23_kadal-teame

       మణిరత్నం దర్శకత్వంలో గౌతమ్‌ కార్తీక్‌ (కార్తీక్‌ కుమారుడు) హీరోగా, తులసి (రాధ 2వ కుమార్తె) హీరోయిన్‌గా మద్రాస్ టాకీస్‌, జెమిని ఫిలిం సర్క్యూట్‌ బేనర్‌లపై రూపొందుతున్న చిత్రం 'కడలి'. మణిరత్నం, మనోహర ప్రసాద్‌ నిర్మాతలు. అరవిందస్వామి చర్చ్‌ ఫాదర్‌గా, అర్జున్‌ మీసాల దొరగా ముఖ్య పాత్రలు పోషించారు. మంచు లక్ష్మి మరో పాత్రను పోషించారు. ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. ఇటీవలే ఆడియో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. చిత్ర నటీనటుల పరిచయ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సుహాసిని, అర్జున్‌, కార్తీక్‌ నటీనటులను పరిచయం చేశారు. అనంతరం కార్తీక్‌ ట్రైలర్స్‌ను విడుదల చేశారు.

10       ఈ సందర్భంగా ఏ ఆర్ రెహ్మాన్ తన సంగీత విభావరితో అందరినీ ఆకర్షించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రెహ్మాన్ మాట్లాడుతూ ‘కొత్తదనం కోసం మణిరత్నం, నేనూ తపిస్తాం కాబట్టే, మా కాంబినేషన్ బావుంటుంది’ అని తనమనసులోమాట బయటపెట్టాడు.

kadali-audio-function_12a
         గీతాంజలి లాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు అన్న ప్రశ్నకు మణిరత్నం సమాధానం చెబుతూ, 'గీతాంజలి ఎప్పుడో అయిపోయింది. కొత్తగా అలోచించి ఎదగడానికి ప్రయత్నిస్తా’ అన్నారు. సీనియర్ నటుడు అర్జున్ మాట్లాడుతూ, 80, 90 మంది దర్శకులతో తాను పనిచేసాననీ, అయినప్పటికీ మణిరత్నం దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉందన్నారు.
        కార్తీక్ మాట్లాడుతూ, తనకు తెలియకుండానే మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం తన కొడుకు గౌతమ్ కు వచ్చిందన్నారు. మోహన్ బాబు కుమార్తెగా తనకీ అవకాశం రాలేదని లక్ష్మీ ప్రసన్న చెప్పింది. కేవలం ఆ పాత్రకు ఎవరైతే బావుంటారో వారినే మణిరత్నం సంప్రదిస్తారని ఆయన దగ్గర ఎలాంటి సిఫార్సులకు తావులేదని అందుకే ఆయన చిత్రాలు ట్రెండ్ సెట్టర్స్ అవుతాయని సుహాసిని మణిరత్నం అభిప్రాయపడ్డారు.

Kadali_Audio_Release_Function_Photos_30aaa

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Seetamma vakitlo sirimalle chettu big release
Allu sirish gowravam teaser  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles