Harish shankar ready for gabbarsingh sequel

director harish shankar, pawan kalyan, gabbarsingh, ready for gabbarsingh sequel, gabbarsingh working stills, producer ganesh, dabang, samlman khan dabaang two, pawan kalyan images,

harish shankar ready for gabbarsingh sequel

15.gif

Posted: 12/01/2012 01:27 PM IST
Harish shankar ready for gabbarsingh sequel

gabbar-singh-new-working-still

ఒక తిక్క హీరోకి మరో తిక్క దర్శకుడు తోడై,  తిక్క తిక్కగా హిట్టిచ్చిన సినిమా ఏందంటే గబ్బర్ సింగ్ గుర్తొచ్చేస్తుంది కదూ.. అంతేకాదు ఈ మూవీ ద్వారా ‘నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుంది’ అంటూ పవన్‌కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల కుంభవృష్టి కురిపించారు. ఈ కలెక్షన్ల మోతకు సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్’ మాతృక అని తెలిసిందే.  బాలీవుడ్లో ఆ ‘దబాంగ్’ కు ఇప్పటికే సీక్వెల్‌ తయారై రిలీజ్ కు రెడీ అయిపోతోంది. ఇందులో హాట్ ఐటెం సాంగ్ లో కరీనా బొద్దుగా కనిపించి టీజర్ లో ఇప్పటికే సందడి చేస్తోంది.
          ఈ నేపథ్యంలో ‘గబ్బర్‌సింగ్’ సీక్వెల్ గురించి కూడా టాలీవుడ్‌లో రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి.  ఈ ఆలోచనలో భాగంగానే ‘గబ్బర్‌సింగ్’ నిర్మాత బండ్ల గణేష్ గత నెలలో ‘గబ్బర్‌సింగ్ ఇన్ హైదరాబాద్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయడంతో సీక్వెల్‌కు సంబంధించి ఊహాగానాలు ఇంకా జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే దర్శకుడు హరీష్‌శంకర్ ‘గబ్బర్‌సింగ్’ సీక్కెల్ కి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
           షూటింగ్ జరుగుతున్నప్పుడే సీక్వెల్‌కి కథ తయారు చేసుకొన్నారట హరీష్. ఆ విషయం పవన్‌కళ్యాణ్‌కి సూచాయగా కూడా ఆయన వివరించారట. అంతేకాదు, నా దగ్గర సీక్వెల్‌కు సంబంధించి అద్భుతమైన కథ సిద్ధంగా ఉంది. అలాగే పవర్‌ఫుల్ టైటిల్ కూడా ఒకటి అనుకున్నా. ‘గబ్బర్‌సింగ్ ఇన్ హైదరాబాద్’ అనే టైటిల్ మాత్రం నాది కాదు. నిర్మాత గణేష్ ఎందుకు చేయించారో నాకు తెలియదు. పవన్‌కళ్యాణ్‌గారు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సీక్వెల్ చేయడానికి నేను సిద్ధం’’ అని చెప్పి మరో ఆసక్తి కర చర్చకు తెరలేపారు డాషింగ డైరెక్టర్(తిక్క) హరీష్ శంకర్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yeto vellipoyindi manasu pramotional scenes
Premato nuvvu vastavani movie audio launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles