Nagarjuna damarukam movie release on 23rd november

nagarjuna damarukam, nagarjuna, king, nag, damarukam, release, damarukam movie release on 23rd november, anushka, anushka hot, charmi hot, rr venkat, dasari narayana rao, director srinivasa reddy, nag updates,

nagarjuna damarukam movie release on 23rd november

7.gif

Posted: 11/21/2012 01:27 PM IST
Nagarjuna damarukam movie release on 23rd november

damarukam_inner

ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. నాగ్ భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ మూవీ ఢమరుకం ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున కొద్ది సేపటిక్రితం పద్మాలయా స్టూడియోస్ లో వెల్లడించారు. అంతేకాదు. ఈ చిత్ర విడుదలకు సాయపడ్డ దాసరికి, అలంకార్ ప్రసాద్ కు ఆయన థాంక్స్ చెప్పారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి ధైర్యంగా సినిమా నిర్మించిన ఆర్.ఆర్ వెంకట్ కు నాగ్ అభినందనలు తెలిపారు. ఇంకా నాగ్  'డమరుకం' గురించి ఏమన్నారంటే.. ఈ సినిమా నాకు ఎన్నో పాఠాలు నేర్పింది' డమరుకం చిత్రం వాయిదాతో ఓర్పు, సహనం లాంటి పదాల విలువ తెలిసిందన్నారు. ప్రస్తుతం డమరుకం సినిమాకు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయాయని వివరించారు. డమరుకం విడుదల ఆలస్యం కావడంతో ఎన్నో చిత్రాలపై బరువు పడిందని.. అందులో మా ఫ్యామిలీ చిత్రాలు కూడా ఉన్నాయని తెలిపారు. చిత్రసీమలో ఎన్ని విభేదాలున్నా డమరుకం విడుదలకు సహకరించిన అందరికి ఈ సందర్బంగా కృతజ్క్షతలు తెలిపారు. డమరుకం చిత్రం వరుసగా వాయిదా వేసుకుంటూ రావడంతో గత నెలరోజులుగా ఫ్యాన్స్‌ తో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డానన్నారు.

damarukam_movie_latest_stillseeఇక చిత్రంగా కొన్ని సినిమాలు ఆలస్యంగా విడుదలై సంచలనం సృష్టిస్తాయి. నాగార్జున ‘డమరుకం’ కూడా అదే కోవకు చెందిన సినిమా అవుతుందని, అవ్వాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డ కు వత్తు తగిలించి ‘ఢ’మరుకం గా మార్పు చేసిన ఈ సినిమా కోసం వారి ఎదురు చూపు ఈ నెల 23వరకూ ఆగాల్సిందే.
      ఇదిలా ఉంటే ఈమూవీని దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఎంతో ఎఫర్ట్ పెట్టి ఓ వెండితెర అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారని చిత్రం యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఫాంటసీ సినిమాలకు భిన్నంగా, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందిందని, గ్రాఫిక్స్ దృశ్యాలు సంభ్రమాశ్చర్యాలకు లోనుచేస్తాయని వారు అంటున్నారు. మహాశివుడు, మహావీరుడు, మహామాంత్రికుడు... ఈ ముగ్గురి నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలిసింది. ఇక అనుష్క అందాలు, ‘ఘుమా ఘుమా చాయ్’ అంటూ చార్మి ఒలికించిన హొయలు యువతరాన్ని కట్టిపడేస్తాయని చెప్పొచ్చు.
       ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, సమర్పణ: కె.అచ్చిరెడ్డి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Petition on bus stop in hrc
Pawan kalyan remuneration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles