Rajni vikram simha not to release on pongal

Rajinikanth kochadaiyaan, Rajinikanth kochadaiyaan release, Rajinikanth kochadaiyaan movie, Rajinikanth kochadaiyaan postpone, kochadaiyaan movie postpone, Rajinikanth movie postpone, kochadaiyaan release on april.

It's a disappointing news for all the fans of Rajinikanth. Well, the superstar's next film Kochadaiyaan, which was supposed to release for Pongal, has been postponed.

Rajni Vikram Simha not to release on pongal.png

Posted: 11/15/2012 05:00 PM IST
Rajni vikram simha not to release on pongal

kochadayaan

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా ఎప్పడు విడుదల అవుతుందో సరిగ్గా తెలియని పరిస్థితి నెలకొంది. సినిమా విడుదల తేదీని ప్రకటించినా ఆ సినిమా థియేటర్ కు వెళ్ళేంత వరకు కూడా నమ్మకం లేకుండా పోయే రోజులు వచ్చాయి. ఇక రానున్న సంక్రాంతి సీజన్ లో భారీ సినిమాలు విడుదల అవుతాయని భావించారు. కానీ ఈ సంక్రాంతి బరి నుండి ఒక్కొక్క సినిమా మెల్లిమెల్లిగా తప్పుకుంటున్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘కొచ్చడయాన్ ’ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు దానిని పోస్ట్ పోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రజినీ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎక్కువ శాతం యానిమేషన్ ఉండటంతో మరింత సమయం పట్టేటట్టు ఉండటంతో ఈ సినిమాని సంక్రాంతి రేస్ నుండి తప్పించారు. ఈ సినిమాని ఏప్రిల్ లో విడుదల చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారట. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రం పోస్ట్ పోన్ కావడంతో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తేజ్ ‘నాయక్ ’ సినిమాకి గట్టి పోటీ లేనేది లేకుండా పోయింది. మరి ఈ నాయక్ ఏం చేస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles