Film producer and director v b rajendra prasad birthday

film producer and director v b rajendra prasad birthday, producer vb rajendra prasad movies.hero jagapathibabu father vb rajendra prasad, vbr movies, annapurna movie, aatmabalam movie, amtastulu moviem, jagapathi art pictures

film producer and director v b rajendra prasad birthday

15.gif

Posted: 11/04/2012 03:45 PM IST
Film producer and director v b rajendra prasad birthday

vb-and-his-sonee

వి.బి. రాజేంద్ర ప్రసాద్... జగపతి సంస్థ అధినేత..  తెలుగు చిత్రసీమలో తిరుగులేని పేరు. ఎన్నో కమనీయ దృశ్య కావ్యాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన శక్తి ఆయన.  తెలుగు తెరకు కథాబలంతో కూడిన సినిమాలను కమనీయంగా మలిచి అందిచడంలో ప్రముఖ పాత్ర వహించిన దర్శక నిర్మాత వి.బి. సినిమా నిర్మాణాన్ని ఓ తపస్సులా భావించి ... ఓ యజ్ఞంలా పూర్తి చేయడం ఆయన ప్రత్యేకత. సినిమాకి కథను సిద్ధం చేసుకోవడం ... నటీనటులను ఎంపిక చేసుకోవడం ... ఆ తరువాత సందర్భానికి తగినట్టుగా పాటలు రాయించుకోవడం ... దగ్గరుండి వాటిని రికార్డు చేయించుకోవడం ... ఇలా ప్రతిదీ ఓ పద్ధతి ప్రకారం పక్కాగా చేసుకోవడం ఆయనకి అలవాటు. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఆ సినిమా విడుదల అయ్యేంత వరకూ ఆ ప్రాజెక్టులో పాలు పంచుకున్న ఏ ఒక్కరికీ ఆయన ఎలాంటి ఇబ్బంది కలిగించేవారు కాదు. అందుకే ప్రతి ఒక్కరు జగపతి సంస్థని తమ కుటుంబంగా భావించి, అంకిత భావంతో పనిచేసే వారు ... ప్రతి సినిమా విజయం కోసం పరితపించే వారు.
        ఈ ఫలితంగానే ఆ సంస్థ నుంచి వచ్చిన 'అన్నపూర్ణ' ... 'ఆరాధన' ... 'ఆత్మబలం' ... అంతస్తులు' ... 'ఆస్తిపరులు' ... 'అదృష్ట వంతులు' ... ' దసరాబుల్లోడు'  వంటి చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాయి. చిత్ర సీమలో 1959 నుంచి ఆయన ప్రారంభించిన ప్రస్థానం దశాబ్దాలపాటు అప్రతిహతంగా కొనసాగింది. నిర్మాతగా ఆయన ఎదుర్కున్న ఒడిదుడుకులు అన్నీ ఇన్నీ కావు. తాను నమ్ముకున్న సినిమా కోసం ఎన్నో సాహసాలు ... మరెన్నో త్యాగాలు చేశారు. తన ఇంట్లో పనిచేసేవారి కోసం 'పిచ్చిమారాజు' సినిమా తీసి, వచ్చిన లాభాలను వాళ్లకి పంచిన సహృదయం ఆయన సొంతం. నేడు (నవంబర్4) వతేదీన జన్మించిన ఈ మహామూర్తికి తెలుగువిశేష్.కాం జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi khaidi remake with charan harish
Richa gangopadhyay out of allu arjun movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles