టాలీవుడ్ కి ‘ఏమైంది ఈవేళ’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చినా, మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్ తో ‘రచ్చ ’ సినిమా తీసి సక్సెస్ సాధించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చకున్న సంపత్ నంది తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ ఆ దర్శకుడి స్టోరి విని గ్రీన్ సిగ్నల్ ఇఛ్చినట్లు వార్తలు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా శరత్ మరార్ గా ఖరారు అయినట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. శరత్ మరార్ అనే అతను ఎన్టీవీకి సీఈఓ గా వ్యవహరిస్తున్నాడు. గత కొంత కాలంగా శరత్ మరార్ తో పవన్ సాన్నిహిత్యం పెరగడంతో ఇతనికి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. రచ్చ' లాగానే పక్కా కమర్షియల్ స్టోరీ ఐడియాతో పవన్ ని సంప్రదించాడని,గబ్బర్ సింగ్ తరహా హిట్ అవుతుందని నమ్మి స్కిప్టు ఓకే చేసాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించి ప్రకటన వస్తుందని చెప్పుకుంటున్నారు. పవన్ ఫ్యాన్స్ కి సరిపోయేలా డైలాగులు,సీన్లతో మళ్లీ కలుస్తానని సంపత్ పవన్ కళ్యాణ్ కి చెప్పాడని అంటున్నారు. మొత్తానికి సంపత్ నంది మెగా ఫ్యామిలీ హీరోల దర్శకుల జాబితాలో చేరబోతున్నాడన్న మాట.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more