Brahmanandam jaffa movie

brahmanandam-jaffa-movie director vennela kishore, producer ramesh varma

brahmanandam-jaffa-movie

17.gif

Posted: 09/17/2012 06:35 PM IST
Brahmanandam jaffa movie

Brahmanandam_Jaffa       ‘జఫ్పా’... ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి ఎంతో ఇష్టమైన పేరు. సినిమాల్లో బ్రహ్మీ నటనవలే ఈమూవీ కూడా విడుదలకు ముందే కొత్తపోకడ తెచ్చింది. చిత్ర సీమలో సాధారణంగా దర్శకులు నిర్మాతలుగా, నిర్మాతలు దర్శకులుగా మారడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే ఓ సినిమా నిర్మాణం పూర్తి కావొస్తుండగా, ఆ సినిమా పూర్తి రైట్స్ తీసుకుని నిర్మాతగా మారడం అరుదుగా జరుగుతుంటుంది. బ్రహ్మానందం ప్రధాన పాత్ర ధారిగా రూపొందుతోన్న 'జఫ్ఫా' సినిమా విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుండగా, 'వీర' దర్శకుడు రమేష్ వర్మ, ఈ సినిమా పై పూర్తి రైట్స్ తీసుకుని నిర్మాతగా మారినట్టు చెబుతున్నారు. jaffa_f
       ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలను ఓ నిర్మాతగా రమేష్ వర్మ చూస్తున్నారు. ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ రైట్స్ ను సాయి మనాలి ఎంటర్ టైన్మెంట్ వారికి ఫ్యాన్సీ రేటుకి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మిగతా ఓవర్సీస్ రైట్స్ ను బ్లూ స్కై వారికి ఇచ్చినట్టు చెబుతున్నారు. వెన్నెల కిషోర్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, జైలు నేపథ్యంలో తెరకెక్కుతోంది.
      ఆమధ్య విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి విపరీతమైన స్పందన వచ్చింది. అప్పటి నుంచి పెరుగుతోన్న అంచనాలు బిజినెస్ పెరగడానికి కారణంగా చెబుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu movie updates
Bharat vennela one and half  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh