Love story new telugu movie with fresh cast

love story new telugu movie with fresh cast

love story new telugu movie with fresh cast

18.gif

Posted: 08/20/2012 06:25 PM IST
Love story new telugu movie with fresh cast

       ప్రస్థానం ఫేమ్‌ సందీప్‌ కిషన్‌, ఎస్‌ఎం ఎస్‌ ఫేమ్‌ రెజీనా జంటగా వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎల్బీడబ్లు. ఫేమ్‌ సత్తారు దర్శకత్వంలో చాణక్య భూనేటి నిర్మిస్తున్న చిత్రం 'రొటీన్‌ లవ్‌స్టోరీ'. దానికి మిక్కీ జే మేయర్‌ స్వరాలందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. vaadiponi_parijata_pushpameee
    ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను దర్శకుడు వెల్లడించారు. మనకో ప్రేమకథ ఉంటుంది. మన స్నేహితులకూ, బంధువులకూ ప్రేమకథలు ఉంటాయి. మన చుట్టూ ఉన్న సమాజంలోనూ చాలా చాలా ప్రేమకథలు ఉంటాయి. మన చుట్టూ ఉన్న సమాజంలోనూ చాలా చాలా ప్రేమకథ లుంటాయి. ఇవన్నీ చూసి, విని మనకు ప్రేమంటేనే బోర్‌ అనిపిస్తుంది. రొటీన్‌గా కన్పిస్తుంది. కానీ ఎవరి ప్రేమ వారికి కొత్తగానే ఉంటుంది. ఆ ఫీల్‌ రాకపోతే అది ప్రేమేకాదు. ప్రేమ అనేది ఎప్పటికీ వాడిపోని పారిజాత పుష్పం అని మన కవులు ఊరికే అనలేదు. మాది కూడా అలాంటి జాబితాలోని లవ్‌స్టోరీనే అని చెప్పారు.
       నిర్మాత మాట్లాడుతూ, హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలతోపాటు కొన్ని సాహసోపేత సన్నివేశాలను తీశాం. కథ,కథనాలు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. టేకింగ్‌ విభిన్నంగా ఉంటుంది. ఎల్బీడబ్లు. తరహాలోనే దీన్ని చాలా న్యూ వేలో మా దర్శకుడు తెరకెక్కించారు. సెప్టెంబర్‌లో పాటలను, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు.

      ఈ చిత్రానికి కెమెరా: సురేష్‌ భార్గవ్‌, ఆర్ట్‌: ఉపేందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan nayak movie shooting in grees
Ice ice new love story movie starts in vijayanagaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles