Shilpa shetty baby shower function

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Shilpa Shetty baby shower: Bollywood came to bless the baby.Shilpa Shetty with husband Raj Kundra The beautiful and gorgeous Shilpa Shetty has had her baby shower yesterday where many Bol

Shilpa Shetty baby shower function..GIF

Posted: 05/05/2012 01:49 PM IST
Shilpa shetty baby shower function

Shilpa-Shetty-baby-shower

తెలుగు, హిందీ, తమిళ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శిల్పంలాంటి సుందరి శిల్పాశెట్టి త్వరలో తల్లికాబోతున్న విషయం తెలిసిందే. ఈమె నిన్న సాయంత్రం ముంబయి శివారులోని తన సొంత ఇంట్లో అంగరంగ వైభవంగా సీమంతం జరుపుకుంది. ఈ వేడకకు బాలీవుడ్ హీరోయిన్లు రవీనా టాండన్, నేహా ధూపియా, మలైకా అరోరా, సమీరారెడ్డి ఇంకా పలువురు ప్రముఖులు హాజరై శిల్పాశెట్టిని ఆశీర్వదించారు.

ఈ వేడుకకు వచ్చిన అధితులకు శిల్పాశెట్టి చెల్లెలు షమితా శెట్టి దగ్గరుండి అతిథి మర్యాలు చూసింది.'బాజీగర్' ... చిత్రం ద్వారా బాలీవుడ్ తెరకి పరిచయమైన శిల్పాశెట్టి, అతి తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోయింది. 'సాహసవీరుడు - సాగరకన్య' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఆమె, ఆ తరువాత 'వీడెవడండీ బాబూ' ... 'ఆజాద్' ... 'భలేవాడివి బాసూ' వంటి చిత్రాలతో అలరించింది.  40 కి పైగా సినిమాల్లో నటించిన శిల్పాశెట్టి, అవకాశాలు మందగించడంతో పెళ్లి బాట పట్టింది. 2009 లో ఆమె ప్రముఖ బిజినెస్ మేన్ రాజ్ కుంద్ర ను వివాహమాడింది. ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాలతో పాటు, ఐపీఎల్ ఫ్రాంఛైజీలను నిర్వహిస్తోంది శిల్పాశెట్టి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh hyderabad theaters list
Sanjay dutt surprised ram charan at zanjeer set  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles