Special story on mega power star ram charan tej

special story, on mega power, star ram charan tej

special story on mega power star ram charan tej

4.gif

Posted: 03/27/2012 01:40 PM IST
Special story on mega power star ram charan tej

           ram_charan_tej_inn222333చరిత్రను ఒకసారి పరికిస్తే, ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి చేరిన వారంతా కేవలం వారి వారి తపన, కృషి, పరిశ్రమతో జీవితాల్లో పైకెదిగిన వారే.  వంశపారంపర్యంగానో, తండ్రి లేదా తాతల వలనో ఆ అత్యున్నత శిఖరం పైకెక్కి కూర్చుందామంటే అయ్యేపని కాదు. ఇందుకు తార్కాణం మనకు ఎన్నో సందర్భాల్లో అగుపిస్తుంది.  రాజకీయరంగం లో చూస్తే..  రాష్ట్రపతి కొడుకు రాష్ట్రపతి,  ప్రధాని, సీఎం కొడుకులు ఆయా పదవుల్లో ఊరికే కూర్చుని ఏలిన సందర్భాలు ఉండనే ఉండవు.  సంస్కృతిక, కళా రంగాల్లోనూ ఇదే ఒరవడి మనకు అగుపిస్తుంది.
            గొప్ప నాయకుడు కావాలన్నా, ఈ హీరో అందరివాడు అనిపించుకోవాలన్నా కేవలం తన స్వయంకృషి తో ప్రజల మనసులు గెలుచుకోవాల్సిందే.  మరో మార్గం లేనే లేదు.  ఈ మంత్రాన్ని చిన్నవయసులోనే అవుపాసన పట్టి అక్షరాలా ఆచరిస్తున్న యంగ్ హీరోలు ఎవరంటే టాలీవుడ్ లో అందరి నోటా వచ్చేమాట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.  తన తండ్రి తెలుగు చలన చిత్ర సీమను సుధీర్ఘ కాలం పాటు ఏలుతోన్న మెగాస్టార్ చిరంజీవి.  ఫలితంగా చరణ్ కు సాధారణంగానే తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. అయినప్పటికీ పైన ఉదహరించిన విధంగా చరణ్ ఏనాడు ఎక్కడా తన గర్వాన్ని ప్రదర్శించిన సందర్భాలు ఎంతవెతికినా కనిపించవు. ఇది చరణ్ కు అత్యంత సన్నిహితులే కాదు. ఆయన ఇప్పటివరకూ చేసిన సినిమాల లైట్మెన్ ను అడిగినా వచ్చేమాట.rachha_rachha_inner_right
           సినీ రంగంలోకి రావాలన్న ఆలోచన మెదిలిన నాటినుంచే ఎంతో కష్టపడి సినీ హీరోకి ఎలాంటి లక్షణాలుండాలో, అర్హత లేమిటో రామ్ చరణ్ పూర్తిగా తెలుసుకుని రంగంలోకి దూకాడు. ఇప్పటికే తన మెగా ఫ్యామిలీ కి ఉన్న భారీ అభిమానగణాన్ని నిరాశ పరచకుండా ఉండేందుకు నటనలో నాణ్యత చూపించాడు. ముఖ్యంగా ఫైట్స్ లోనూ, డాన్స్ లోను కఠోర పరిశ్రమ చేశాడు.. చేస్తునే ఉన్నాడు. అందువల్లే  'చిరుత' సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన తొలి సినిమాతోనే సినీ అభిమానులతో పాటు, విమర్శకుల ప్రశంసలు సైతం రామ్ చరణ్ తేజ్ అందుకున్నాడు.
           చరణ్ రెండో సినిమా 'మగధీర' గీతాఆర్ట్స్ బ్యానర్లో రూపొందింది. పునర్జన్మ కి సంబంధించిన ఈ ప్రేమకథా చిత్రంలో శత్రువులని చీల్చి చెండాడే ధీరుడుగా అద్భుతంగా నటించిన చరణ్, బాక్సాఫీస్  రికార్డులను తిరగరాశాడు. యావత్ భారతావనిలో ఈ సినిమా చిరస్థాయిగా నిలిచింది, నిలుస్తోందికూడా. రెండో సినిమాతోనే అటు మాస్ ఆడియన్స్ నూ, ఇటు క్లాస్  ప్రేక్షకులను తన అభిమానులుగా చరణ్ చేసుకున్నాడు.
           ఇక  చరణ్ మూడో సినిమా 'ఆరెంజ్ ' అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కింది. ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందించకపోయినా, సంగీత పరంగా అద్భుత స్థానాన్ని అందుకుంది. అంతేకాదు మరో తరహాలో  లవర్ బాయ్ గా అతను  ప్రేక్షకుల  హృదయాలపై తనదైన ముద్ర  వేయగలిగాడు.      

           ఇక, తాజాగా  చరణ్ తన నాలుగో  సినిమా 'రచ్చ'తో మరోసారి  అభిమానులను  అలరించనున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహించిన  ఈ సినిమా ఏప్రిల్  5 న విడుదలకానుంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఎన్నో సంచలనాలకు చిరునామా అవుతోంది. ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో సార్లు గాయాలైనప్పటికీ ఈ యువ హీరో తన దైన శైలిలో ముందుకు సాగుతున్నాడు.ram_charan_super_pic3
           తన వల్ల చిత్ర షూటింగ్ ఆగిపోయి, ప్రొడ్యూసర్ కు, సినీ కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా మొండిగానే ముందుకు సాగుతున్నాడు ఈ యువ హీరో. ఇటీవల జరిగిన ఆడియో ఫంక్షన్ లో ‘‘ఇంకా ఎన్ని ఎముకలు విరిగినా ఏమీ ఫర్వాలేదు. అనుకున్న సమయానికి అనుకున్నవిధంగా ‘రచ్చ’ సినిమాను అందించి తీరుతా’’ అని ఈ యువకుడు అన్నమాటలు అందరినీ మెప్పించటమే కాదు, ఆశీర్వాదాలూ అందించాయి.
              ఇలా చరణ్ నటించింది నాలుగు సినిమాలే అయినప్పటికీ  ఎన్నో సినిమాలు చేసిన హీరో  అంతటి  క్రేజ్ నీ, ఇమేజ్ ని సొంతం  చేసుకున్నాడు.  తన కుటుంభానికున్న ఇమేజ్ ని పక్కన పెట్టి, సాదాసీదాగా అందరితో, అన్ని వర్గాల వారితో, ఎంతో ఆప్యాయతగా ఉంటూ, అందరినీ కలుపుకుపోయే  రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు ఇవాళ.  ఈ చెర్రీ నటన పరంగానే కాదు, ఆయన ఆశించిన అన్ని రంగాల్లోనూ అత్యున్నత స్థాయికి వెళ్లాలని నిన్నటి నుంచీ సందేశాలు, శుభాకాంక్షల పరంపర కొనసాగుతూనే ఉంది.  అటు పత్రికాముఖంగాను, టీవీల్లోనూ, వెబ్ సైట్స్లో నూ, సోషల్ నెట్ వర్క్స్ లోనూ మెగా అభిమానులే కాదు. చిత్ర సీమలోని ఇతర హీరోల ప్యాన్స్ కూడా చరణ్ కు సందేశాలు ఇస్తున్నారంటే ఈ ఉప్పుంగ తరంగానికి హద్దేముంది, ప్రగతి పరిమళించదా, జగతి జలజరించదా... వెనుదిరిగి చూడాల్సిన అవసరమేముంటుంది.
           ఇంత మంది ఆశీర్వచనాలు పొందుతోన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు మా వంతుగా,  ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఎన్నటికీ ఉంటాయని, తండ్రిని మించిన తనయుడు అయి ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకోవాలని మనసారా ఆకాంక్షిస్తోంది ఆంధ్రావిశేష్.కామ్....హ్యాపీ బర్త్ డే చెర్రీ....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan tej new movie rachha latest stills
Charmi as a sex worker  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles