Kajal agarwal love affairs

kajal agarwal love affairs, Prabhas Kajal Agarwal love affair the end,Prabhas Kajal Agarwal love affair,Kajal Agarwal images, Kajal Agarwal wallpapers, Kajal Agarwal Gallery

kajal agarwal love affairs

kajal.GIF

Posted: 12/13/2011 07:02 PM IST
Kajal agarwal love affairs

kajal agarwal love affairs

తొలిచూపు ప్రేమల మీద నమ్మకం లేదు. అసలు ఒక వ్యక్తిని చూడగానే ఎలా ప్రేమ పుడుతుందో నాకు అర్థం కావడంలేదు. ప్రేమ అనేది మనసులకి సంబంధించినది. కాబట్టి మనసూ మనసూ కలవాలి. అప్పుడే ప్రేమ ఏర్పడుతుంది. ఒక్కసారి కాదండి... ఇప్పటివరకు నేను చాలాసార్లు ప్రేమలో పడ్డాను. అన్ని ప్రేమలూ దాదాపు విజయాన్ని చూశాయి’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. అమాయకంగా కనిపించే ఈ గులాబీ బాల బోల్డన్ని లవ్‌స్టోరీలు నడిపారంటే ఎవరికీ నమ్మబుద్ధి కాదు. కాజల్ చెబుతున్నది కూడా రియల్ లైఫ్ ప్రేమ గురించి కాదు రీల్ లైఫ్‌లో సాగించినవాటి గురించి. తన ప్రతి సినిమాలోనూ హీరోతో లవ్‌ఎఫైర్ సాగిస్తుంటానని, రియల్‌గా మాత్రం ఇప్పటివరకు ప్రేమలో పడలేదని కాజల్ అగర్వాల్ చెప్పారు. ‘‘నాకు ప్రేమలో పడే తీరిక ఎక్కడిదండి? పైగా ప్రేమ గురించి నాకు కొన్ని నిర్దిష్టమైన భావాలు ఉన్నాయి. 

ఇది లాంగ్ ప్రాసెస్ కాబట్టే నేనింకా ప్రేమలో పడలేదు. ఒక వ్యక్తిని అర్థం చేసుకుని, ప్రేమలో పడేంత సమయం లేదు. షూటింగ్స్ చేయడంతోనే సరిపోతుంది. ఒకవేళ నా మనోభావాలకు దగ్గరగా ఉన్న వ్యక్తి తారసపడితే అతనికి ‘ఐ లవ్ యు’ చెప్పడానికి వెనుకాడను. మా ఇంట్లో ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించరు. అయితే ఐ లవ్ యు చెప్పిన తర్వాత ఏళ్ల తరబడి ప్రేమించను. 

ఆసల్యం చేయకుండా పెళ్లి చేసేసుకుంటా’’ అన్నారు కాజల్. ప్రస్తుతం మహేష్‌బాబు సరసన ‘ది బిజినెస్‌మాన్’, సూర్య సరసన తమిళ చిత్రం ‘మట్రాన్’, విజయ్‌తో మరో తమిళ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారామె. కమిట్ అయి త్వరలో సెట్స్‌కి వెళ్లనున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఈ విషయం గురించి కాజల్ చెబుతూ -‘‘ప్రస్తుతం చేస్తున్నవన్నీ క్రేజీ ప్రాజెక్ట్సే. మూడు, నాలుగు సినిమాలతో బిజీగా ఉంటున్నా. చివరికి మా చెల్లెలు నిషాతో హాయిగా కబుర్లు చెప్పడానికి కూడా తీరిక చిక్కడంలేదు. అందుకే ‘నువ్వు ప్రొఫెషన్‌తో ప్రేమలో పడిపోయావ్’ అంటూ జోక్ చేస్తుంటుంది నిషా’’ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu lakshmi prasanna new movie is gundello godavari
Alibaba nalabai dongalu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles