Airtel raises $750 million via perpetual bonds జియో ఎఫెక్ట్: ఖాతాదారులకు వడ్డింపులు.. మార్కెట్లో లాభాలు

Telecom stocks rally over 3 airtel at 52 week high

Companies, Economy of India, Telecommunications in India, CNX Nifty, Bharti Airtel, Jio, BSE SENSEX, Reliance Industries Limited, NIFTY 50, Vodafone Idea Limited, Mukesh Ambani, Airtel Africa, Reliance Jio Infocomm, Germany, S&P BSE SENSEX INDEX, TCS, Sun, Telecommunication, technology, business

Telecom shares surged amid hopes that the price hike could possibly herald an end in India's bruising telecom price war unleashed by the entry of Reliance Jio. Reliance Jio Infocomm announced that it will charge customers 6 paise per minute for voice calls made to rival phone networks.

జియో ఎఫెక్ట్: ఖాతాదారులకు వడ్డింపులు.. మార్కెట్లో లాభాలు

Posted: 10/10/2019 04:06 PM IST
Telecom stocks rally over 3 airtel at 52 week high

భారత టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చి అనతికాలంలోనే దేశంలో అత్యధిక మంది కస్టమర్లను కలిగిన సంస్థగా సంచలనాలకు తెరతీసీన రిలయస్ జియో నెట్ వర్క్.. లాంచింగ్ సమయంలో చేసిన హామీని తుంగలో తొక్కుతూ.. తన మాటను వెనక్కి తీసుకుంది. అదేంటంటే.. లాంచ్ చేసిన సందర్భంగా తమ మొబైల్ నెట్ వర్క్ ద్వారా జీవితకాలం ఉచిత వాయిస్ (ఫోన్) కాల్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. కేవలం డేటాకు మాత్రమే రీఛార్జ్ అని చెప్పింది.

దాదాపు మూడేళ్లపాటు ఇలా ఉచిత కాల్స్ అందించిన జియో ఇప్పుడు ఆ అఫర్ ను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. తమ నెట్ వర్క్ నెంబర్లకు కాల్ చేస్తే ఎలాంటి చార్జీలు వుండవని.. చెప్పిన జియో.. ఇక ప్రతీ కాల్ కు డబ్బులను వసూలు చేయనుంది, ఇప్పటి వరకు తమ నెట్ వర్క్ నుంచి తమ ఇతర నెట్ వర్క్ నెంబర్లకు ఎలాంటి చార్జీలు వుండవని చెప్పిన జీయో.. ఫోన్ చేస్తే మాత్రం వడ్డింపులు తప్పవని తాజాగా తేల్చి చెప్పింది. ఈ చార్జీలు నిమిషానికి ఆరు పైసల చొప్పున వసూలు చేసేందుకు జియో సంస్థ సిద్దం చేసుకుంది. దీంతో తమ కస్టమర్లకు వాత పెట్టేందుకు కూడా రెడీ అయ్యింది.

గతంలో ఒక టెలికాం సంస్థ నుంచి మరో టెలికాం సంస్థకు ఫోన్ కాల్స్ చేస్తే అనుసంధాన చార్జీ కింద నిమిషానికి 14 పైసలు చెల్లించాల్సి వచ్చేది. అయితే, ట్రాయ్ దీన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 తరువాత ఈ చార్జీలు కూడా ఉండకూడదు అని ట్రాయ్ గతంలో పేర్కొన్నది. డిసెంబర్ 31 తరువాత ఈ ఐయూసీ చార్జీల వ్యవస్థ ఉండకూడదు అని ట్రాయ్ పేర్కొన్నది.  కానీ ఇంతవరకు దానిపై ట్రాయ్ నిర్ణయం తీసుకోలేదు. జియో ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు ఈ ఐయూసీ కింద ఎయిర్ టెల్, ఐడియా వంటి సంస్థలకు రూ. 13,600 కోట్లు చెల్లించింది.

కాగా ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు కాల్స్ కు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది.  దీనికోసం కొత్త టారిఫ్ ప్లాన్ లను తీసుకొచ్చింది.  రూ. 10 రూపాయల టారిఫ్ రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 1జీబీ డేటాను అందిస్తున్నట్టు జియో పేర్కొన్నది. జియో నుంచి జియో కు కాల్స్, జియో నుంచి ల్యాండ్ లైన్, జియో నుంచి పేస్ బుక్, వాట్సాప్ ఫోన్ కాల్స్ కూడా ఉచితమే.. అలానే ఇతర నెట్ వర్క్ లనుంచి ఇన్ కమింగ్ కాల్స్ కూడా ఉచితంగా అందుకోవచ్చు.  

రిలయన్స్ జియో తాజా చార్జీల మోత.. స్టాక్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ ఉదయం మార్కెట్ సెషన్ ప్రారంభంకాగానే, బెంచ్ మార్క్ సూచికలు స్వల్ప నష్టాల్లోకి జారుకోగా, టెలికం కంపెనీల ఈక్విటీలు మాత్రం భారీగా లాభపడ్డాయి. జియో దారిలోనే ఎయిర్ టెల్ కూడా పయనిస్తుందన్న అంచనాలతో ఆ సంస్థ ఈక్విటీ ఏకంగా 6 శాతం పెరిగింది. ఇక వోడాఫోన్ ఐడియా ఏకంగా 15 శాతం లాభపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 23 పాయింట్ల నష్టంలో ఉన్నాయి.

జియో మాదిరిగానే మిగతా అన్ని కంపెనీలు కూడా ఇతర నెట్ వర్క్ లకు చేసుకునే కాల్స్ పై చార్జీలను విధిస్తారని మార్కెట్ వర్గాలు నమ్మాయని, దీంతో ఇప్పటివరకూ నష్టాల్లో ఉన్న ఎయిర్ టెల్, ఐడియా వంటి సంస్థలు కొంతమేరకు కోలుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ఈ కారణంతోనే ఆయా కంపెనీల ఈక్విటీలకు కొనుగోలు మద్దతు వచ్చిందన్నారు. ఇదిలావుండగా, నేడు వెల్లడికానున్న టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు, ఆపై ఇన్ఫోసిస్ ఫలితాలు సమీప భవిష్యత్ లో మార్కెట్ గమనాన్ని నిర్దేశించవచ్చని అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance Jio  Airtel  Idea  Vodafone  telecom  markets  equity  telecommunications  technology  business  

Other Articles

Today on Telugu Wishesh