Benz launches 3rd gen CLS భారతీయ విఫణిలోకి మెర్సడెస్ బెంజ్ సీఎల్ఎస్..!

2018 mercedes benz cls launched at rs 84 70 lakh

Cars, Mercedes Benz, Mercedes cls, CLs, Audi a7, Mercedes cls 2018, Mercedes Benz india, Cls mercedes, Mercedes cls price, Mercedes benz cls, Bmw 6 series gran coupe, technology, business

Mercedes-Benz has launched the new-generation CLS sedan in the Indian market. This CLS will be the third generation of the CLS model.

భారతీయ విఫణిలోకి మెర్సడెస్ బెంజ్ సీఎల్ఎస్..!

Posted: 11/17/2018 04:59 PM IST
2018 mercedes benz cls launched at rs 84 70 lakh

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్.. దేశీయ విపణిలోకి సరికొత్త 'బెంజ్ - సీఎల్‌ఎస్' మోడల్‌ను శుక్రవారం (నవంబరు 16) లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.84.70 లక్షలుగా నిర్ణయించింది. మూడోతరంగా రూపొందించిన ఈ సీఎల్‌ఎస్ మోడల్.. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా డీజిల్ ఇంజిన్‌తో తయారు చేసింది. ప్రస్తుతానికి మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఎస్ 300డి వేరియంట్ మాత్రమే వినియోగదారులకు లభ్యం కానుంది. వచ్చే ఏడాదిలో మరిన్ని వాహనాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.

బెంజ్ - సీఎల్‌ఎస్ ప్రత్యేకతలివే..

* కొత్త మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఎస్ 300డీలో 'ఫేస్ లిఫ్టెడ్' సీ 300డి సెడాన్ 2.0 లీటర్ ఇంజిన్ ను అమర్చారు.
* ఈ ఇంజిన్ 245 పీఎస్ పవర్, 500 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.
* ఈ కారులో 9-స్పీడ్ ఆటో ట్రాన్స్ మిషన్ ఇచ్చారు.
* ఈ కారు 6.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉండనుంది.
* కొత్త సీఎల్ఎస్ కారు ఈ-క్లాస్ ప్లాట్ ఫామ్ ఆధారంగా తయారైంది. దీని పొడవు, వెడల్పు, ఎత్తు ఎక్కువగా ఉంటాయి.
* స్టైలిష్ రూఫ్ లైన్, ఫ్రేమ్ లెస్ డోర్ ఈ కారు ప్రత్యేకం.
* ఇంటీరియర్ పరంగా కారును అద్భుతంగా రూపొందించారు.
* ఈ కారులో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ అమర్చారు. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో‌లకు కూడా సపోర్ట్‌ చేస్తుంది.
* కారులో సన్ రూఫ్ సౌకర్యాన్ని కూడా పొందుపరిచారు.
* 13 స్పీకర్ బర్మెస్టర్ ఆడియో సిస్టమ్
* ఎయిర్ బాడీ కంట్రోల్ ఎయిర్ సస్పెన్షన్, 18 అంగుళాల అలాయ్ వీల్స్, మల్టీబీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ ఈ కారులో అమర్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cars  Mercedes Benz  CLs  Mercedes cls 2018  indian market  technology  business  

Other Articles