Sensex ends above 34000 mark for the first time ever మరోమారు రికార్డు ముగింపులో దేశీయ మార్కెట్లు..

Closing bell sensex ends record high above 34000 nifty above 10 500

BSE Sensex, Sensex 34000, Nifty 50, Sensex record high, Nifty record high, Markets today, business

The BSE Sensex rose 0.21% to end trading at a new high of 34,010.61 points, while the NSE’s Nifty gained 0.37% to 10,531.50

మరోమారు రికార్డు ముగింపులో దేశీయ మార్కెట్లు..

Posted: 12/26/2017 07:01 PM IST
Closing bell sensex ends record high above 34000 nifty above 10 500

దేశీయ మార్కెట్లలో ఇవాళ బుల్‌ జోరు కొనసాగింది. దేశీయ సూచీలు మరోసారి రికార్డు స్థాయిలో ముగిశాయి. నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ.. పాత రికార్డులను బద్దలు కోడుతూ కొత్త రికార్డులను లిఖించుకుంటూ సాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇవాళ సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్‌ ప్రతిష్ఠాత్మక 34వేల మైలురాయిని దాటగా.. నిఫ్టీ కూడా పది వేల మైలురాయిని దాటితూ సరికొత్త గరిష్ఠస్థాయిని చేరుకుంది.

మూడు రోజుల వరుస విరామం తరువాత ఇవాళ ప్రారంభమైన సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ను ఆరంభించిన కొద్ది క్షణాల్లోనే సెన్సెక్స్‌ 34వేల మార్క్ ను తాకింది. అయితే డిసెంబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు కు మరో రెండు రోజుల వ్యవధి మాత్రమే వుండటంతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో ఆ మార్క్‌ నుంచి పడిపోయిన సూచీ.. ఆ తర్వాత చాలాసేపు లాభనష్టాల్లో వూగిసలాడింది.

అయితే చివరి గంటల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మళ్లీ లాభాల బాట పట్టిన సూచీ.. 34వేల మైలురాయిని దాటి సరికొత్త శిఖరాన్ని చేరుకుంది. ఇవాళ్టి ట్రేడింగ్ లో సెన్సెక్స్‌ 70 పాయింట్లు ఎగబాకి 34,011 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 38 పాయింట్లు లాభపడి 10,531 వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో భారతీ ఎయిర్ టెల్‌, అంబుజా సిమెంట్‌, సిప్లా, బాష్ లిమిటెడ్, వేదాంతా లిమిటెడ్ షేర్లు లాభపడగా.. కోల్ ఇండియా, ఎస్బీఐ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యుని లివర్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  Sensex 34000  Nifty 50  Sensex record high  Nifty record high  Markets today  business  

Other Articles