Reliance Jio 4G VoLTE Feature Phones leaked త్వరలో మార్కెట్లోకి రిలయన్స్ జియో చౌకధర 4జీ ఫోన్..

Reliance jio 4g volte feature phones specifications price leaked

low-cost feature phones, low-cost 4G phones, reliance, jio, 4g volte feature phones, specifications, price leaked, launch date, dual edge display, reliance jio, jio, reliance jio 4g volte feature phone, reliance jio 4g feature phone, gadgets, technology

Reliance Jio 4G VoLTE feature phones will reportedly launch soon, and come in two processor variants.

త్వరలో మార్కెట్లోకి రిలయన్స్ జియో చౌకధర 4జీ ఫోన్.. ఇవే ప్రత్యేకతలు

Posted: 06/08/2017 04:30 PM IST
Reliance jio 4g volte feature phones specifications price leaked

అతి త్వరలో మార్కెట్లోకి వస్తాయని భావిస్తున్న రిలయన్స్ జియో 4జీ వీఓఎల్టీఈ ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్ల వివరాలు ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. గ్రామీణ భారతావనిలోని అపారమైన మార్కెట్ పై కన్నేసిన ముఖేష్ అంబానీ ఈ తక్కువ ధర ఫోన్లకు రూపకల్పన చేశారు. అల్పా న్యూమెరిక్ కీబోర్డుతో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. అయితే జియో దీనిని తన కస్టమర్ల కోసం సరికొత్తగా డిజైన్ చేయించడంతో.. మై జీయో, జీయో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్ యాప్స్ కోసం ప్రత్యేక బటన్ లు రూపోందించారు. 4జీ సిమ్ సదుపాయాలను అందుకునేందుకు వీలుగా ఈ ఫీచర్డ్ ఫోన్ ను చూపోందించారు.

ఇక ఈ ఫోన్ లో 2.4 అంగుళాల స్క్రీన్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ అంతర్గత మెమొరీ, మైక్రో ఎస్డీ కార్డు సదుపాయం, 2 ఎంపీ రేర్ కెమెరా, ముందువైపు వీజీఏ కెమెరా ఉంటాయి. వై-ఫై, ఎన్ఎఫ్సీ, జీపీఎస్ సదుపాయాలు వుంటాయి. రెండు మోడల్స్ లో ఇవి లభ్యం కానుండగా, వీటి ధరలు రూ. 1700 వరకూ ఉండగా, తొలి దశలో సబ్సిడీపై రూ. 999 నుంచి రూ. 1,500 మధ్య విక్రయించాలని ముఖేష్ భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 26నే జీయో అత్యంత చౌకధర 4జీ ఫీచర్డ్ ఫోన్ అందుబాటులోకి వస్తాయని వార్తలు వచ్చాయి.

అయితే ఈ ఫోన్ లు ఎప్పడు మార్కెట్లోకి విడుదల అవుతాయన్న విషయం మాత్రం జియో వర్గాలు వెల్లడించలేదు. కాగా త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని మాత్రం లీకులు వదులుతున్న జీయో.. వేగంగా చర్యలను మాత్రం చేపడుతుందని టాక్. ఇప్పటికీ అత్యంత చౌకధరకు 4జీ డేటాతో పాటు ఉచిత కాల్స్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి స్మార్ట్ ఫోన్ ప్రియులను అకర్షించిన జియో.. ఇక గ్రామీణ భారతాన్ని కూడా తమ సేవలను అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ చౌకధర 4జీ ఫోన్ ను రూపోందించిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    
జియో 4జీ ఫీచర్డ్ ఫోన్ ప్రత్యేకతలు

2.4 ఇంచుల డిస్ప్లే
ర్యామ్‌: 512 ఎంబీ
ప్రాసెసర్‌: క్వాల్‌కామ్‌, స్పెడ్రమ్
4జీ కనెక్టవిటీ, వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ
4 జీబీ ఇంటర్నల్‌ మెమరీ (మైక్రో ఎస్డీ కార్డు సదుపాయం)
కెమెరా: 2 మెగాపిక్సల్‌
ఫ్రంట్‌ కెమెరా: విజీఏ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : reliance jio  jio  4g phones  4g featured phones  low cost phones  gadgets  technology  

Other Articles