ఐదు రాష్ట్రాల ఫలితాలు: నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు.. Sensex falls 98 points lower nifty ends below 8950

Sensex falls 98 points lower nifty ends below 8950

Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

Investors chose to sit tight as the Sensex remained in the bearish territory for the second day, dropping further by 98 points, and anxiety concerning state poll results and a probable Fed rate hike grew.

ఐదు రాష్ట్రాల ఫలితాలు: నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు..

Posted: 03/08/2017 06:41 PM IST
Sensex falls 98 points lower nifty ends below 8950

స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాల బాటపట్టాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన తరుణంలో ఇక దేశవ్యాప్త ప్రజలతో పాటు ఇటు మదుపరులు  కూడా ఓటరు తీర్పు కోసం వేచి చూస్త్తున్న క్రమంలో కాసింత ముందు జాగ్రత్తాగా లాభాల స్పీకరణకు మొగ్గుచూపారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సానుకూల పవనాలను అందిపుచ్చుకున్నా.. దేశీయ సూచీలు లాభాలను మాత్రం అందుకోలేక పోయాయి. ఓటరు నాడి అనుకూలంగా వుండని పక్షంలో కేంద్రం ఎలాంటి చర్యలకు పూనుకుంటుంది.. అలా కాని పక్షంలో ఎలా వ్యవహరించనుందన్న విషయంతో డోలాయమానంలోకి చేరిన మదుపురులు లాభఆలను స్వీకరణకు దిగడం మార్కెట్లకు నష్టాలు తప్పలేదు.

ఇక దీనికి తోడు అమెరికా ఫెడ్ రిజర్వు త్వరలో ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో కూడా మదుపరులను అలోచనలో పడేసింది. సెన్సెక్స్‌ 97.62పాయింట్లు నష్టపోయి 28901 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 22పాయింట్లు నష్టపోయి 8924 వద్దకు చేరింది. బ్యాకింగ్‌, హెల్త్‌కేర్‌ రంగాలు తప్పితే మిగిలిన రంగాల షేర్లు ప్రధానంగా నష్టాల్లోనే ట్రేడ్‌ అయ్యాయి. బాష్‌, యస్‌బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐషర్‌ మోటార్స్‌, కోటక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉండగా.. ఐడియా సెల్యూలార్‌, టాటాస్టీల్‌, ఓఎన్‌జీసీ, టెక్‌మహీంద్రా, టాటామోటార్స్‌ షేర్లు నష్టపోయాయి. నిక్కీ, షాంఘై కాంపోజిట్‌ తప్పితే మిగిలిన ప్రపంచ మార్కెట్లు అన్నీ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles

Today on Telugu Wishesh