ఐదు నెలల కనిష్టస్థాయికి సెన్సెక్స్.. 7950 మార్కుకు దిగువన నిఫ్టీ Sensex tanks 385 points, Nifty ends at 6-month closing low

Sensex tanks 385 points nifty ends at 6 month closing low

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

BSE Sensex closed lower by 385 points, or 1.47%, to 25,765, while the Nifty 50 of the National Stock Exchange falls 145 points, or 1.80%, to 7,929

ఐదు నెలల కనిష్టస్థాయికి సెన్సెక్స్.. 7950 మార్కుకు దిగువన నిఫ్టీ

Posted: 11/21/2016 05:29 PM IST
Sensex tanks 385 points nifty ends at 6 month closing low

దేశీయ మార్కెట్లను మళ్లీ నష్టాలలో ముంచెత్తాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం మార్కెట్లను వీడటం లేదు. దీంతో మార్కెట్లు ఇవాళ కూడా నష్టాలబాట పట్టాయి. దీనికి తోడు విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల కారణంగా మార్కెట్లు తిరోగమనంలో పయనించాయి, ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వు ద్రవ్య పరపతి విధాన సమీక్షించనున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచుతారన్న సంకేతాలతో అమెరికా మార్కెట్లు తిరోగమనంలో పయనిస్తున్నాయి.

ఉదయం మార్కెట్ల ఆరంభం నుంచే నష్టాలు ముంచెత్తాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం కాగానే స్వల్ప నష్టాలతో ప్రారంభం కాగా, ఆ తరువాత అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచుతుందన్న వార్తలతో మద్యహ్నానికి మూడు వందలకు పైగా పాయింట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. దీని ఫలితంగా సెన్సెక్స్ 5 నెలల కనిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ కూడా 6 మాసాల కనిష్ట స్థాయికి దిగజారింది. సెన్సెక్స్ 326 పాయింట్లకు పైగా కోల్పోయి 26 వేల దిగువకు చేరింది. ఇది  ఆరు నెలల కనిష్టంకాగా,  నిఫ్టీ కూడా దాదాపు  వంద పాయింట్లకు పైగా నష్టంతో  కీలకమైన మరో మద్దతు స్తాయి8 వేల దిగువకు చేరింది.

మార్కెట్లు ముగింపు సమయానికి మరింతగా జతకలసి నష్టాలు ముంచెత్తాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 385 పాయింట్ల నష్టంతో 25,765 పాయింట్ల వద్ద,  నిఫ్టీ 145 పాయింట్ల నష్టంతో 7929 పాయింట్ల వద్ద  క్లోజ్ అయ్యాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలు ముంచెత్తాయి. ఈ క్రమంలో రమారమి అన్ని రంగాల షేర్లు నష్టాలలో పయనించాయి. అటో, బ్యాంకింగ్, బ్యాకింగ్ నిఫ్టీ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య, పబ్లిక్ సెక్టార్ యూనిట్, మెటల్స్ రంగ సూచీలు అత్యధికంగా నష్టాలను చవిచూశాయి.

క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, అయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ ఎం జీ సీ, కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ, టెక్నాలజీ రంగ సూచీలు స్వల్ప నష్టాలను ఎదుర్కోన్నాయి.  ఈ క్రమంలో భారతీ ఇన్ ఫ్రాటెల్, విఫ్రో, టెక్ మహీంద్రా, రిలయన్స్, టీసీఎస్ తదితర సంస్థలు అత్యధిక లాభాలను కురిపించగా, బ్యాంక్ అఫ్ బరోడా, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, ఏషియర్ మోటార్స్, యస్ బ్యాంక్, హిండాల్కో తదితర సంస్థల షేర్లు క్షీణించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles

Today on Telugu Wishesh