Sensex tanks 176 points as Mauritius tax treaty rattles investors

Sensex falls 175 points mauritius tax treaty weighs

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

The Nifty ended tad below 7850, down 38.95 points or 0.5 percent at 7848.85. The Sensex closed down 175.51 points or 0.7 percent at 25597.02. About 1103 shares have advanced, 1446 shares declined, and 158 shares are unchanged.

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. 7850 మార్కుకు ఎగువన నిఫ్టీ

Posted: 05/11/2016 05:16 PM IST
Sensex falls 175 points mauritius tax treaty weighs

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను చవిచూశాయి. విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల ధోరణుల నేపథ్యంలో మార్కెట్ల ఇవాళ నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా మారిషస్ పెట్టుబడులపై పన్ను ఎఫెక్ట్ దేశీయ సూచీలపై పడింది. ఆ దేశం నుంచి వచ్చే పెట్టుబడులపై మూలధన పన్ను విధించాలని కేంద్రప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయంతో, స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభమైన అరగంటలోనే మార్కెట్లు నష్టాలను ఎదుర్కోన్నాయి. సెన్సెక్స్ 105.37 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా, నిప్టీ కూడా 23.23 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది.

ఫలితంగా మార్కెట్టు ముగిసే సమయానికి మార్కెట్లు మరింత నష్టాన్ని మూటగట్టుకున్నాయి. నిఫ్టీ బెంచ్ మార్క్ 7850 మార్కుకు దిగువన ట్రేడింగ్ ముగించింది. అటు సెన్సెక్స్ కూడా 25వేల 600 పాయింట్ల మార్కుకు దిగువ స్థాయికి చేరుకుంది, సెన్సెక్స్ 176 పాయింట్ల నష్టంతో 25 వేల 597 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 39 పాయింట్ల నష్టంతో 7850 మార్కుకు దిగవన ముగిసింది. నిఫ్టీ 7 వేల 849 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది, కాగా ఇవాళ  మొత్తంగా 1103 సంస్థల షేర్లు లాభాల బాటలో పయనించగా, 1446 సంస్థల షేర్లు నష్టాలలో పయనించాయి, 158 సంస్థలకు చెందిన షేర్లు తటస్థంగా నిలిచాయి.

ఇవాళ్లి ట్రేడింగ్ లో రమారమి అన్ని సూచీలు నష్టాల బాటలో పయనించాయి. అటో, హెల్త్ కేర్, ఐటీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, అయిల్ అండ్ గ్యాస్ సహా పలు సూచీలు భారీగా నష్టాలను ఎదుర్కోగా, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరెబుల్స్, మెటల్స్, ఎఫ్ ఎం జీ సీ, టెక్నాలజీ, చిన్నతరహా సూచీలు స్వల్ప నష్టాలను ఎదుర్కోన్నాయి. కాగా బీఎస్సీ మధ్య తరహా పరిశ్రమల సూచీ మాత్రం స్వల్ప లాభాన్ని అర్జించింది. ఈ నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్, యాక్సిక్ బ్యాంక్ హిండాల్కో, బాస్చ్, కోటక్ మహీంద్ర తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, భారతీ ఇన్ప్రాటెల్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.    

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles