Ford to launch compact sedan Figo Aspire soon

Ford to launch compact sedan figo aspire soon

Ford to launch compact sedan Figo Aspire, Ford compact sedan car, Ford Figo Aspire soon, Indian markets, Ford, Ford India, Ford Aspire, Figo Aspire, Sedan Car, Compact Sedan

Ford India is set to launch a new compact sedan -- Figo Aspire -- by this year, according to various media reports.

భారతీయ విఫణిలోకి త్వరలో ఫోర్డ్ సెడాన్ ఫిగో ఆస్పైర్ కారు

Posted: 04/02/2015 06:48 PM IST
Ford to launch compact sedan figo aspire soon

భారతీయ విఫణిలోకి ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మరో కోత్తకారును ప్రవేశపెట్టనుంది. ఇటీవల ప్రవేశపెట్టిన ఫిగో కారుకు మార్కెట్లో సక్సె స్ సాధించడంతో.. ఈ కారులోనే మార్పులు చేసి చిన్నసైజులోనే సెడాన్ కారును రూపోందించి ప్రవేశపెట్టాలని యోచిస్తుందని సమాచారం. ఇప్పటికే ఈ మేరకు పలు అడుగులు ముందుకేసిన సంస్థ ఈ ఏడాది చివరి నాటికీ కాంపాక్ట్ సెడాన్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనికి ఫోర్డ్ ఫిగో అస్పైర్ అని నామకరణం కూడా చేసింది.

పిగో అస్సైర్ కారు రమారమి ఫోగో మాదిరిగానే వున్నా సెడాన్ కారు తరహాలో రూపోందించబడుతుంది. ఈ కారును డీజిల్, పెట్రోల్ రెండు వేరియంట్లలో రూపోందించనున్నారు. గత ఏడాది ఈ కారు నమూనాను అటో ఎగ్జిబిషన్ లో ప్రదర్శనలో వుంచగా, పలువురిని అకర్షించింది. ఈ కారులో డ్రైవర్ సీటు సహా అన్ని సీట్లకు ఎయిర్ బ్యాగులు అమర్చబడి వుంటాయని సంస్థ ప్రతినిధుల నుంచి సమాచారం. ఈ నాలుగు మీటర్ల ఫోర్డు ఫిగో అస్పైర్ కారు మారుతి స్విఫ్టు డిజైర్ , హోండా అమేజ్, హుందాయ్ అసెంట్, టాటా జెస్ట్ కార్లకు పోటీ ఇవ్వనుందని అటోరంగ నిఫుణలు అభిప్రాయపడుతున్నారు.  ఐదు నుంచి 8 లక్షల మధ్య దరలను పలు మోడళ్లును సంస్థ యాజమాన్యం తీసుకురానుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ford  Ford India  Ford Aspire  Figo Aspire  Sedan Car  Compact Sedan  

Other Articles