Google stoped business operations in china shifted its office to hongkong

Google, Search Engine, China, services, Business operations, Hongkong, stoped, hackers

google stoped services to china, shifted its office to Hongkong

చైనాలో వ్యాపారకలాపాలను నిలిపేసిన గూగుల్

Posted: 09/22/2014 01:59 PM IST
Google stoped business operations in china shifted its office to hongkong

దండిగా వ్యవహరించేవాడికి మొండిగా సమాధానం ఇవ్వాలనేది పెద్దల నానుడి. అదే నానుడిని ప్రపంచ నెంబర్ వన్ సర్చ్ ఇంజన్ గూగుల్ అసునరించింది. చైనాలో అమలుపర్చింది. తన కార్యకలాపాలను గత రాత్రి నుంచి అర్ధాంతరంగా చైనాలో ఆపివేసింది. ఇటీవల కాలంలో హ్యాకర్ల దాడులు ఎక్కువ కావడం, అనేక నిబంధనలు వ్యాపార లావాదేవిలకు అడ్డుగా మారడంతో గూగుల్ ఈ నిర్షయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చైనా నుంచి హాంకాంగ్ కు తమ కార్యాలయాన్ని గూగుల్ బదిలీ చేసింది. ఈ పరిణామంపై చైనా ప్రభుత్వం గూగుల్ పై నిప్పులు చెరుగుతోంది. గూగుల్ సర్చ్ ఇంజిన్ పై సెన్సార్ విధించడం, కొన్ని సెన్సిటివ్ సర్చ్ ఆపరేషన్స్ ను ప్రభుత్వం ఫిల్టర్ చేయడం లాంటి అంశాలు గూగుల్ కు ఇబ్బందిగా మారాయి.
 
దాంతో చైనా నుంచి తమ కార్యకలాపాలను హాంకాంగ్ బదిలీ చేయాలని తీసుకున్న నిర్ణయం సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీని షాక్ గురి చేసింది. ఈ వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజీంగ్ హెడ్ క్వార్టర్స్ లోని కార్యాలయం ఎదుట మద్దతుదారులు ఫ్లవర్ బోకేలు, చాకోలెట్, ఇతర బహుమతులతో నిరసన తెలిపారు. 400 మిలియన్ల జనాభా ఉన్న చైనా గూగుల్ కు అతిపెద్ద బిజినెస్ మార్కెట్ గా ఉంది. అయితే అధికారులు చైనా సర్చ్ సర్వీస్ లపై ఆంక్షలు విధించడం, నిబంధనలు అనుకూలంగా లేకపోవడంతో గూగుల్ ఈ విధంగా షాకిచ్చినట్టు తెలుస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Google  Search Engine  China  services  Business operations  Hongkong  stoped  hackers  

Other Articles