The Healthy Home Remedies Which Helps To Grow Hair | Health Tips | Beauty Tips

Healthy home remedies hair grow tips

hair grow tips, hair care remedies, hair grow remedies, hair tips, healthy remedies for hair, hair packs, vitamins for hair

Healthy Home Remedies Hair Grow Tips : The Healthy Home Remedies Which Helps To Grow Hair Fast.

జుట్టు పెరుగుదలకు ఉపక్రమించే ఇంటి చిట్కాలు

Posted: 08/26/2015 01:21 PM IST
Healthy home remedies hair grow tips

ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరు జుట్టు సంబంధిత సమస్యల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా జుట్టు తెల్లబడిపోవడం, పొడిబారిపోవడం, కాలక్రమంలో రాలిపోవడం, ఇంకా ఇతర సమస్యలు వేధిస్తుంటాయి. వాటిల్లో ముఖ్యంగా జుట్టు రాలిపోయే సమస్య అమ్మాయిలు, మహిళల్ని తెగ ఇబ్బంది పెడుతుంది. ఇలా రాలిపోవడానికి కారణమేమిటంటే.. పోషకాహారం సరైన సమయంలో తీసుకోకపోవడమేనని నిపుణులు అంటున్నారు. ‘విటమిన్ ఏ’ లోపం వల్ల జుట్టు పెరగడం తగ్గుతుంది. దీంతో మరికొన్ని విటమిన్లు జుట్టుపై ప్రభావం చూపుతాయి. మరి.. ఈ సమస్యను అధిగమించాలంటే.. జుట్టు పెరగడానికి అవసరమైన ప్రొటీన్లు అధికంగా వుండే ఆహారాపదార్థాల్ని రెగ్యులర్ గా తీసుకుంటే చాలు.

బంగాళదుంపలో విటమిన్‌ ఎ అధికం. ఇది ఉత్పత్తి చేసే ఒక రకమైన నూనెలాంటి పదార్థం మాడుకు మేలు చేస్తుంది. మాడు పటిష్టంగా ఉంటే చుండ్రు తగ్గుతుంది. ఇక క్యారెట్‌, మామిడి, ఆప్రికాట్స్‌, గుమ్మడి, కర్భూజ వంటి పండ్లు జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఉపకరిస్తాయి. వీటిని ఆహారంలో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. గుడ్డు తింటే శరీరానికి ప్రొటీన్లు దండిగా లభిస్తాయి. జింక్‌, సెలీనియమ్‌, సల్ఫర్‌, ఐరన్‌ వంటి ఖనిజాలు కూడా గుడ్డులో పుష్కలం. వెంట్రుకలు చిట్లిపోకుండా ఆక్సిజన్‌ను అందించేందుకు ఇనుము తోడ్పడుతుంది. ఇనుము గుడ్డులోనే కాదు.. కోడిమాంసం, చేపల్లోను దొరుకుతుంది. ఐరన్‌, బీటా కెరొటిన్‌, పోలేట్‌, విటమిన్‌ సి.. వంటివన్నీ జుట్టు పెరుగుదలకు అవసరం. ఈ నాలుగూ తాజా పాలకూరల్లో ఉంటాయి.

ఒత్తయిన జుట్టు కావాలనుకుంటున్న వాళ్లు తరచూ పాలకూరను తినాలి. వాల్‌నట్స్‌ను కూడా మరువొద్దు. వీటిలో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్‌ అధికం. బయొటిన్‌, విటమిన్‌ ఇ వంటివి సెల్స్‌ను డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి. వాల్‌నట్స్‌లో ఉండే రాగి జుట్టుకు సహజమైన రంగును అందిస్తుంది. ఈ విధమైన చిట్కాలను రెగ్యులర్ గా పాటిస్తే.. ఫలితాన్ని గమనించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hair grow tips  beauty tips  home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more