The Healthy Face Masks For Glowing Skin | Beauty Home Remedies | Beauty Tips

Healthy face masks for glowing skin home remedies beauty tips

face masks, beauty face masks, healthy face masks, home face masks, glowing skin tips, glowing skin remedies, skin home remedies, skin beauty remedies, skin beauty tips, skin care tips

Healthy Face Masks For Glowing Skin Home Remedies Beauty Tips : Experts Giving Some Healthy Face Masks Which Increases The Glowing Of Skin Twice.

అందాన్ని రెట్టింపు చేసే ఫేస్ మాస్కులు

Posted: 08/11/2015 11:19 AM IST
Healthy face masks for glowing skin home remedies beauty tips

మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సంరక్షణకు, సౌందర్య పోషణకు సంబంధించి రకరకాల జాగ్రత్తలు పాటిస్తేనే అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రెగ్యులర్ గా వాడే బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే కొన్ని ఫేస్ మాస్కులను ఇంట్లోనే చేసుకుని చర్మానికి పట్టిస్తే.. ఎంతో సురక్షితం, శ్రేయస్కరం. మరి.. సహజసిద్దమైన పదార్థాలను ఉపయోగించి చర్మాన్ని సంరక్షించే రెమెడీలను ఎలా చేస్తారో, వాటిని ఎలా అప్లై చేసుకోవాలో, వాటివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..

* అవకాడో : ఒక అవొకాడోని తీసుకుని, దానిని కట్ చేసుకొని లోపల ఉండే గుజ్జుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాన్ని మెత్తగా చేసుకున్నగా తర్వాత అందులో ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. 10-15 నిముషాలు ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. ‘పొడిచర్మం’ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

* బంగాళదుంప-పెరుగు : ఒక బంగాళదుంపను ఉడికించుకుని ముక్కలుగా కోసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ముక్కల్ని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అలా సిద్దం చేసుకున్న బంగాళదుంప గుజ్జు ఒక చెంచా తీసుకుని దానికి అరచెంచా పెరుగుతో జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

* తేనె-రోజ్ వాటర్ : ఒక పాత్రలో తేనె, రోజ్ వాటర్ ని సముపాళ్లలో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 10 నిముషాలు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. తేనె చర్మానికి సహజసిద్దమైన మాయిశ్చరైజర్ గా పని చేసి తేమని అందిస్తే.. రోజ్ వాటర్ చర్మానికి మంచి టోనర్ గా ఉపయోగపడుతుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. పలితం బాగుంటుంది.

* ఎగ్ వైట్ : కోడి గుడ్డులోని తెల్లసొనను తీసుకుని దాన్ని బాగా గిలకొట్టి, ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంటపాటు ఆరనిచ్చి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ వల్ల చర్మం తాజాదనాన్ని సంతరించుకోవడమే కాకుండా ఆరోగ్యవంతంగా కూడా కనిపిస్తుంది. అలాగే చలిగాలుల నుంచి చర్మాన్ని కూడా చక్కగా సంరక్షిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : face masks  skin beauty remedies  home skincare tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more