butter face packs beauty benefits | beauty tips | glow sking tips

Butter face packs beauty benefits glow bright skin tips

butter face pack, beauty tips telugu, butter face pack tips, butter face pack making, face packs, beauty benefits, beauty food items, nutrient foods, healthy beauty tips, curd face packs, honey face packs

butter face packs beauty benefits glow bright skin tips : The Beauty benefits with different types of butter face packs which improves the glow, bright, shine of skin. These remedies also protects skin everytime from polution.

బటర్ ఫేస్ ప్యాక్ తో మెరుగైన చర్మం...

Posted: 04/03/2015 05:45 PM IST
Butter face packs beauty benefits glow bright skin tips

వేసవికాలంలో చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసం కేవలం బ్యూటీ ప్రోడక్ట్స్ మాత్రమే కాకుండా ఎన్నోరకాల హోమ్ రెమెడీలు కూడా వున్నాయి. అలాంటి రెమెడీల్లో బటర్ ఫేస్ ప్యాక్ ఒకటి! బటర్ తో రకరకాల ప్యాక్స్ తయారుచేసుకుని ముఖానికి పట్టిస్తే.. ఈ వేసవిలో మెరుగైన చర్మసౌందర్యాన్ని పెంపొందించవచ్చు. అలాగే చర్మం ఎంతో ఫ్రెష్ గా, ప్రశాంతంగా వున్నట్లు అనిపిస్తుంది. బటర్ తో తయారుచేసే ఫేస్ ప్యాక్ ని వారానికి ఒకసారి వేసుకుంటే చాలు.. ఇది ఇతర బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే సమర్థవంతంగా పనిచేసి, చర్మ సౌందర్యాన్ని పెంచడంతోపాటు సంరక్షిస్తుంది. పైగా ఈ బటర్ తో చేసే ఫేస్ ప్యాక్స్ లో చర్మాన్ని రక్షణ కల్పించే ఎన్నో పోషకాలు కూడా వుంటాయి. మరి.. ఆ ఫేస్ ప్యాక్స్ ఏంతో తెలుసుకుందామా..

బటర్ ఫేస్ ప్యాక్స్ :

- బటర్‌ను ఫ్రెష్ క్రీమ్‌తో మిక్స్ చేసి.. బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, కొద్దిసేపటివరకు అలాగే వుంచుకోవాలి. అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ స్టాంట్ గ్లో వస్తుంది. ఇలా వారానికి ఒకసారి ముఖాని అప్లై చేసి మసాజ్ చేస్తే ముఖంలో మంచి గ్లో వస్తుంది.

- ఒక కప్పు పెరుగు తీసుకుని అందులో కాస్త బటర్‌ వేసి బాగా మిక్స్ చేయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల డ్రై స్కిన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

- ఒక పాత్రలో కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని అందులో 2 చెంచాలా బటర్‌ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు ప్యాక్‌గా వేసుకొని కొద్దిసేపటివరకు అలాగే వుంచుకోవాలి. అనంతరం కాటన్‌తో తుడిచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
- గుప్పెడు బాదంను పొడి చేసి, అందులో 3 టేబుల్ స్పూన్ల బటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకోవాలి. కొద్దిసేపటివరకు ఇలాగే వుంచుకుని, నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేస్తే.. మెరిసే సౌందర్యం లభిస్తుంది.

ఇలా ఈ విధంగా బటర్ తో తయారుచేసుకునే రకరకాల ఫేస్ ప్యాకుల్లో ఏదైనా ఒకటి చర్మానికి తగ్గట్లు వారానికొకటి ట్రై చేయాలి. మొదటి ఏ రెమెడీని అయితే ముఖానికి పట్టిస్తారో అదే కంటిన్యూ చేయాలి. వారానికొకటి మారిస్తే ఫలితం వుండదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : butter face pack  beauty tips telugu  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more